Nahid Rana: పాకిస్థాన్​ను వణికించిన 21 ఏళ్ల కుర్రాడు.. బాబర్ సహా అందరికీ పోయించాడు!

Babar Azam, Nahid Rana, PAK vs BAN: పాకిస్థాన్ జట్టును ఓ బంగ్లాదేశ్ యంగ్ స్పీడ్​స్టర్ వణికించాడు. లీథల్ పేస్​తో ఆ టీమ్ పనిబట్టాడు. బాబర్ ఆజం సహా అందరు బ్యాటర్లకు ఓ రేంజ్​లో పోయించాడు.

Babar Azam, Nahid Rana, PAK vs BAN: పాకిస్థాన్ జట్టును ఓ బంగ్లాదేశ్ యంగ్ స్పీడ్​స్టర్ వణికించాడు. లీథల్ పేస్​తో ఆ టీమ్ పనిబట్టాడు. బాబర్ ఆజం సహా అందరు బ్యాటర్లకు ఓ రేంజ్​లో పోయించాడు.

బంగ్లాదేశ్​తో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో పాకిస్థాన్ చెత్తాట కంటిన్యూ అవుతోంది. తొలి టెస్టులో చిత్తుగా ఓడి పరువు తీసుకున్న దాయాది జట్టు.. రెండో టెస్టులోనూ అదే ఆటతీరుతో మరింత విమర్శల పాలవుతోంది. 21 ఏళ్ల ఓ యంగ్ పేసర్ దెబ్బకు ఆ జట్టు విలవిల్లాడుతోంది. విరాట్ కోహ్లీ కంటే గొప్ప అంటూ పాక్ మాజీలు, అభిమానులు తెగ బిల్డప్ ఇచ్చే బాబర్ ఆజం ఇంకోసారి తుస్సుమన్నాడు. 11 పరుగులకే పెవిలియన్​కు చేరాడు. బంగ్లాదేశ్ యంగ్ పేసర్ నహీద్ రానా దెబ్బకు పాక్ ఇన్నింగ్స్ షేక్ అయింది. బాబర్ సహా మిగిలిన బ్యాటర్లకు అతడు ఓ రేంజ్​లో పోయించాడు. పాక్ కెప్టెన్ షాన్ మసూద్​ను కూడా అతడే ఔట్ చేశాడు.

కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన నహీద్ రానా.. 140 కిలోమీటర్లకు తగ్గని పేస్​తో బౌలింగ్ చేశాడు. స్పీడ్​లో వేరియేషన్స్ చేస్తూనే బంతిని ఇరువైపులా స్వింగ్ చేయడంతో అతడి బౌలింగ్​లో పరుగులు తీసేందుకు పాక్ బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. నహీద్ వేసిన ఔట్ స్వింగర్​కు ఆతిథ్య జట్టు కెప్టెన్ షాన్ మసూద్ కీపర్​కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్​కు చేరాడు. బాబర్​ను కూడా చక్కటి గుడ్ లెంగ్త్ బంతితో ఔట్ చేశాడు. గుడ్ లెంగ్త్​లో పడి వేగంగా దూసుకొచ్చిన బంతిని డిఫెన్స్ చేయబోయాడు. కానీ ఎడ్జ్ తీసుకున్న బాల్ వెళ్లి స్లిప్స్​లో ఉన్న షాద్మన్ ఇస్లాం చేతుల్లో పడింది. ఎలాంటి ఫుట్ మూమెంట్ లేకపోవడంతో బంతిని డిఫెన్స్ చేయడంలో బాబర్ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత మరో బ్యాటర్ సౌద్ షకీల్​కు పెవిలియన్ బాట చూపించాడు నహీద్ రానా.

పాక్ బ్యాటింగ్​లో ఎంతో కీలకమైన కెప్టెన్ మసూద్​తో పాటు బాబర్, షకీల్​ను నహీద్ వెనక్కి పంపడంతో ఆ టీమ్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. నహీద్ నిలకడైన వేగం, స్వింగ్​తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. అతడి బౌలింగ్​లో పరుగులు చేయడం కంటే వికెట్లు కాపాడుకోవడమే గగనంగా మారింది. ఇక, పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (43) తప్పితే ఎవ్వరూ రాణించలేదు. నహీద్​కు తోడుగా హసన్ మహమూద్ 4 వికెట్లతో చెలరేగాడు. ప్రస్తుతం పాక్ 9 వికెట్లకు 145 పరుగులతో ఉంది. ఆ టీమ్ ఆధిక్యం 157. తొలి టెస్టులో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన బంగ్లాదేశ్.. రెండో టెస్టులోనూ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్​లోనూ నెగ్గితే సిరీస్ 2-0తో బంగ్లా వశమవుతుంది. సొంతగడ్డపై వైట్​వాష్ జరిగితే అంతకంటే అవమానం పాక్​కు మరొకటి ఉండదు. మరి.. పాక్​కు మరో ఘోర ఓటమి తప్పదా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments