నాగ చైతన్యకి అడ్డుగా సౌరవ్ గంగూలీ! ఈ ఇద్దరి పోటీ ఏంటంటే?

Naga Chaitanya To Compete With Sourav Ganguly: యువ సామ్రాట్ నాగ చైతన్యకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. నాగ చైతన్య ఇప్పుడు క్రిెకెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీతో పోటీకి రెడీ అయిపోయాడు.

Naga Chaitanya To Compete With Sourav Ganguly: యువ సామ్రాట్ నాగ చైతన్యకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. నాగ చైతన్య ఇప్పుడు క్రిెకెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీతో పోటీకి రెడీ అయిపోయాడు.

నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ యువ సామ్రాట్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అందుకే తండేల్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం.. రిలీజ్ డేట్ కూడా దగ్గర్లోనే ఉంది అంటున్నారు. నాగ చైతన్య ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో పోటీకి సై అంటున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలకు సంబంధం లేకుండా.. ఈ యువ సామ్రాట్ ఇప్పుడు క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీతో పోటీకి రెడీ అయిపోయాడు. అదేంటి.. సినిమాకి- క్రికెట్ కి ఎక్కడ క్లాష్ వచ్చింది? వీళ్లు పోటీ పడటం ఏంటి అనుకుంటున్నారా?

నాగ చైతన్యకు సినిమాలు అంటే ప్యాషన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చైకి రేసింగ్ అంటే పిచ్చి అని కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రేసింగ్ విషయంలోనే నాగ చైతన్య ఇటు గంగూలీతోనే కాకుండా.. అటు బాలీవుడ్ స్టార్లతో కూడా పోటీకి రెడీ అయిపోయాడు. హైదరాబాద్ పేరును ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో మారు మోగించడానికి సిద్ధమయ్యాడు. అసలు విషయం ఏంటంటే.. నాగచైతన్య బ్లాక్ బర్డ్స్ హైదరాబాద్ అనే రేసింగ్ ఫ్రాంచైజ్ ని సొంతం చేసుకున్నాడు. ఆ టీమ్ ఆగస్టు 24 నుంచి ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఆ రేసింగ్ ఫెస్టివల్ లోనే నాగ చైతన్యకు గంగూలీ అడ్డుగా ఉన్నాడు. వారి మధ్య పోరు తప్పదు.

ఈ రేసింగ్ ఫెస్టువల్ లో నాగ చైతన్య హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ని సొంతం చేసుకోగా.. గంగూలీ కోల్ కతా రాయల్ టైగర్స్ కి కో ఓనర్ గా ఉన్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం గోవా ఏసెస్ టీమ్ కి ఓనర్ గా ఉన్నాడు. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ స్పీడ్ డీమన్స్ ఢిల్లీ ఓనర్ గా ఉన్నాడు. వీళ్లంతా ఈ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో తలపడనున్నారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జెండాను విజయ తీరాలకు చేర్చడానికి నాగ చైతన్యకు గట్టి పోటీనే ఉంది. ఈ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024ని తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 24 నుంచి ఈ రేసింగ్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతోంది. చెన్నై వేదికగా ఆగస్టు 24- 25 రౌండ్ 1 నిర్వహించనున్నారు. ఆగస్టు 31- సెప్టెంబర్ 1న రౌండ్ 2 ఉంటుంది. సెప్టెంబర్ 13- 15లో కోయంబత్తూర్ వేదికగా రౌండ్ 3 ఉంటుంది. ప్రస్తుతం అంతా ఈ రేసింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగానే గంగూలీ వర్సెస్ నాగ చైతన్య అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. మరి నాగ చైతన్య.. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టును సొంతం చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments