VIDEO: కోహ్లీకి గురించి చెడుగా మాట్లాడే వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చిన లెజెండరీ క్రికెటర్‌

విరాట్‌ కోహ్లీ ఆట ఇష్టపడని క్రికెట్‌ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీ ఆటంటే పడిచచ్చే ఫ్యాన్స్‌ ఉన్నారు. అంతెందుకు మన శత్రుదేశం పాకిస్థాన్‌లో కూడా కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు. అయితే.. ఒక క్రికెటర్‌గా కోహ్లీని ఇష్టపడే చాలా మంది కోహ్లీ య్యాటిట్యూడ్‌, అగ్రెషన్‌ అంటే అంతగా ఇష్టపడరు. ఈ కారణాల చేత మరికొంతమంది ఏకంగా కోహ్లీని ద్వేషిస్తుంటారు. కోహ్లీ గ్రౌండ్‌లో అనవసరంగా వేరే ఆటగాళ్లతో గొడవపడుతుంటాడని, చాలా ఎక్కువగా రియాక్ట్‌ అవుతుంటాడని, కొన్ని సార్లు ఓవర్‌ యాక్షన్‌ చేస్తుంటాడనే కామెంట్లు కూడా కోహ్లీ హేటర్స్‌ నుంచి వినిపిస్తుంటాయి. అయితే.. వీటికి ఓ లెజెండరీ క్రికెటర్‌, కొన్ని ఏళ్ల పాటు గొప్ప గొప్ప బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరణ్‌ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు.

ఇటీవల తన బయోపిక్‌ ‘800’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన మురళీ ధరణ్‌.. కోహ్లీ అగ్రెషన్‌ గురించి స్పందిస్తూ.. ‘కోహ్లీని ఎప్పుడైనా గమనించారా? అతను కెప్టెన్‌గా ఉన్నా, లేకపోయినా.. వికెట్‌ తీసిన బౌలర్‌ కంటే కూడా తానే ఎక్కువగా సెలబ్రేట్‌ చేసుకుంటాడు. అది ఓ ఆటగాడిగా కోహ్లీకి ఆటపట్ల ఉన్న అంకితభావం. గ్రౌండ్‌ బయట కోహ్లీ చాలా కామ్‌ అండ్‌ కూల్‌గా ఉంటాడు. కానీ, గ్రౌండ్‌లో చాలా అగ్రెషన్‌గా ఉంటాడు. అది ఆటపై అతనికున్న ప్యాషన్‌. నిజానికి కోహ్లీ తన అగ్రెషన్‌ వల్లే ఇంత గొప్ప ఆటగాడిగా ఎదిగాడు.

కానీ, చాలా మంది కోహ్లీ అగ్రెషన్‌ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. కోహ్లీ అలా చేయాల్సింది కాదు, కోహ్లీ ఇలా చేయాల్సింది కాదు అని.. ఎవరూ కూడా అలా మాట్లాడకూడదు. అతని ఆటతో, అగ్రెషన్‌తో మనకు ఓ గ్రేట్‌నెస్‌ ఇస్తున్నాడు దాన్ని మనం ఆస్వాదించాలి, కోహ్లీ క్రికెట్‌లో ఓ షోమెన్‌’ అంటూ మురళీ ధరణ్‌ పేర్కొన్నారు. నిజానికి కోహ్లీకి తన అగ్రెషన్‌తో జట్టులో ఎంతో జోష్‌ నింపుతుంటాడు. ఆస్ట్రేలియా లాంటి జట్టు వాళ్ల దేశంలో ఓడించాలంటే.. ఆట ఒక్కడే అద్భుతంగా ఉంటే సరిపోదు దానికి తగ్గ అగ్రెషన్‌ కూడా ఉండాలి. అప్పట్లో సౌరవ్‌ గంగూలీ ఎలాగైతే టీమ్‌లో ధైర్యం నిప్పి ప్రత్యర్థిపై ఎదురుదాడి చేయడం నేర్పాడో.. దాన్ని కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కొనసాగించాడు. అందుకే కోహ్లీ ఖాతాలో వరల్డ్‌ కప్‌లు లేకపోయినా అతనొక గొప్ప కెప్టెన్‌గా కీర్తించబడుతున్నాడు. మరి కోహ్లీ అగ్రెషన్‌ గురించి మురళీధరణ్‌ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పర్సనల్ రికార్డుల గురించి రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Show comments