Nidhan
Musheer Khan Hits Kuldeep Yadav For A Massive Six: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఓ కుర్ర బ్యాటర్ చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్‌లో భారీ షాట్లు బాదుతూ భయం పుట్టించాడు.
Musheer Khan Hits Kuldeep Yadav For A Massive Six: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఓ కుర్ర బ్యాటర్ చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్‌లో భారీ షాట్లు బాదుతూ భయం పుట్టించాడు.
Nidhan
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను చూస్తే అవతలి జట్టు బ్యాటర్లు వణికిపోతారు. బంతిని గింగిరాలు తిప్పుతూ ఎక్కడ తమను పెవిలియన్‌కు పంపిస్తాడోనని భయపడతారు. అతడి ఓవర్లలో పరుగులు రాకపోయినా ఫర్వాలేదు.. వికెట్ పడకపోతే అదే పదిలేలుగా భావిస్తారు. అలాంటి కుల్దీప్ను ఓ కుర్ర బ్యాటర్ భయపెట్టాడు. భారీ షాట్లు బాదుతూ అతడ్ని కుళ్లబొడిచాడు. ఇది దులీప్ ట్రోఫీ-2024లో జరిగింది. భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ కుల్దీప్ బౌలింగ్‌ను చిత్తు చేశాడు. ఇండియా బీ తరఫున బరిలోకి దిగిన ముషీర్.. ఇండియా ఏపై భారీ సెంచరీతో చెలరేగాడు. 373 బంతుల్లో 181 పరుగులు చేశాడు. 16 బౌండరీలు బాదిన ఈ యువ కెరటం.. 5 భారీ సిక్సులు బాదాడు. అయితే ఇతర బౌలర్ల కంటే కుల్దీప్ను అతడు ఎదుర్కొన్న తీరు అదిరిపోయింది. అతడి బౌలింగ్‌లో రూఫ్ మీదకు కొట్టిన ఓ సిక్స్ మ్యాచ్‌కే స్పెషల్ హైలైట్‌గా నిలిచింది.
ఇండియా బీ ఇన్నింగ్స్ 111వ ఓవర్ వేసేందుకు వచ్చాడు కుల్దీప్. అప్పటికే 18 ఓవర్లు వేసి 64 పరుగులు ఇచ్చుకున్న ఈ స్టార్ స్పిన్నర్.. ఒక్క వికెట్ కూడా తీయలేదు. అతడి బౌలింగ్‌లో క్లాసికల్ షాట్స్‌తో భారీగా పరుగులు పిండుకున్న ముషీర్.. ఆ ఓవర్లోనూ కుల్దీప్పై అటాకింగ్‌కు దిగాడు. నిర్దాక్షిణ్యంగా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఫుల్ లెంగ్త్‌లో పడిన బంతిని భలేగా పిక్ చేసిన ముషీర్.. ఒక మోకాలి మీద బ్యాలెన్స్ పెట్టి లెగ్ సైడ్ గట్టిగా కొట్టాడు. దెబ్బకు బాల్ వెళ్లి రూఫ్ మీద పడింది. కొంచెమైతే బంతి స్టేడియానికి అవతల పడేదే. కానీ రూఫ్ కొస తాకడంతో బంతి తిరిగొచ్చి ఆడియెన్స్ గ్యాలరీలోకి వచ్చి పడింది. ఈ షాట్ చూసి కుల్దీప్తో పాటు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు బిత్తరపోయారు. ముషీర్ టీమ్మేట్స్ కూడా ఇదేం షాట్ భయ్యా అంటూ షాకయ్యారు.
ఇంటర్నేషనల్ క్రికెట్లో మహా మహా బ్యాటర్లను కూడా పోయించిన కుల్దీప్.. ముషీర్ దెబ్బకు బిత్తరపోయాడు. ఇదేం బాదుడు అంటూ కాసేపు అలాగే ఉండిపోయాడు. 19 ఏళ్ల కుర్రాడు టీమిండియా బౌలర్‌ను కనికరం లేకుండా కొడుతుంటే ఆడియెన్స్ కూడా ఆశ్చర్యంలో అలాగే చూస్తూ ఉండిపోయారు. అయితే అదే ఓవర్లో మరో బిగ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి ముషీర్ ఔట్ అయిపోయాడు. టీమ్ స్కోరు పెంచుదామనే ఉద్దేశంలో అతడు హిట్టింగ్ చేసి వికెట్ సమర్పించుకున్నాడు. కానీ అతడు తన తరహాలో ఆడితే ఔట్ చేయడం ప్రత్యర్థి జట్టుకు సాధ్యమయ్యేది కాదు. 8వ వికెట్‌కు సైనీతో కలసి 204 పరుగులు జోడించాడు ముషీర్. ఒకదశలో 94/7తో ఉన్న ఇండియా బీ 321 పరుగులు చేసిందంటే అది అతడి చలవే. ఆ తర్వాత ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇండియా ఏ ఇప్పుడు 2 వికెట్లకు 66 పరుగులతో ఉంది. మరి.. కుల్దీప్ బౌలింగ్‌లో ముషీర్ ఖాన్ కొట్టిన సూపర్ సిక్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
MUSHEER KHAN HIT A SIX TO THE ROOF OF CHINNASWAMY STADIUM. 🤯 pic.twitter.com/QVyFXcHndJ
— Johns. (@CricCrazyJohns) September 6, 2024