IPL 2024: ధోని క్రేజీ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్.. ఇక మిగిలింది రోహిత్ రికార్డే..!

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డ్ ను సాధించాడు. ఈ క్రమంలో ఎంఎస్ ధోని ఘనతను బద్దలు కొట్టాడు. ఇక మిగిలింది రోహిత్ శర్మ రికార్డే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డ్ ను సాధించాడు. ఈ క్రమంలో ఎంఎస్ ధోని ఘనతను బద్దలు కొట్టాడు. ఇక మిగిలింది రోహిత్ శర్మ రికార్డే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీ.. టోర్నీ ఏదైనా గానీ, రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టడం ఈ రన్ మెషిన్ స్పెషాలిటీ. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో పరుగుల వరదపారిస్తున్నాడు కింగ్ కోహ్లీ. ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఆడిన 12 మ్యాచ్ ల్లో 634 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. ఇక తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 47 బంతుల్లోనే 92 పరుగుల థండర్ ఇన్నింగ్స్ తో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డ్ ను బ్రేక్ చేశాడు కోహ్లీ. ఆ వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీకి రికార్డులు బద్దలు కొట్టడం, సృష్టించడం కొత్తేం కాదు. ఇప్పటికే తన పేరిట ఎన్నో చిరస్మరణీయ ఘనతలను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 92 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్న కోహ్లీ.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో ఎంఎస్ ధోని రికార్డ్ ను బద్దలు కొట్టాడు విరాట్. అదేంటంటే?

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న భారతీయ ఆటగాళ్ల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. తాజాగా అందుకున్న అవార్డుతో కలిసి ఐపీఎల్ చరిత్రలో 18 ప్లేయర్ ఆఫ్ ద అవార్డులు అందుకున్నాడు. ఈ క్రమంలో 17 అవార్డులతో ఉన్న ధోని రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఈ లిస్ట్ లో 19 సార్లు ఈ అవార్డు అందుకుని  అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. ఇక ఈ ఘనతతో పాటుగా మరికొన్ని రికార్డులు సాధించాడు కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు 600+ స్కోర్ చేసిన ప్లేయర్ గా కేఎల్ రాహుల్ తో సమంగా నిలిచాడు. అలాగే మూడు ఐపీఎల్ టీమ్స్(ఢిల్లీ, పంజాబ్, చెన్నై)పై 1000కి పైగా పరుగులు చేసి, ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత నెలకొల్పిన ఏకైక ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. మరి ఒకే మ్యాచ్ లో ఇన్ని రికార్డులు సాధించిన విరాట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments