iDreamPost
android-app
ios-app

ధోని ఫ్యాన్స్‌కి సూపర్ గుడ్ న్యూస్! రైనా ఇచ్చిన లీక్‌కి దేశం షేక్!

  • Published Apr 17, 2024 | 7:04 PM Updated Updated Apr 17, 2024 | 7:04 PM

MS Dhoni, IPL 2025, Suresh Raina: ధోని ఆట చూసేందుకే స్టేడియానికి వెళ్తున్న వారికి గుడ్‌న్యూస్‌ అందించాడు సురేష్‌ రైనా.. ఇది ధోని ఫ్యాన్స్‌ చాలా పెద్ద గుడ్‌న్యూస్‌. ఇంతకీ ఆ గుడ్‌న్యూస్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

MS Dhoni, IPL 2025, Suresh Raina: ధోని ఆట చూసేందుకే స్టేడియానికి వెళ్తున్న వారికి గుడ్‌న్యూస్‌ అందించాడు సురేష్‌ రైనా.. ఇది ధోని ఫ్యాన్స్‌ చాలా పెద్ద గుడ్‌న్యూస్‌. ఇంతకీ ఆ గుడ్‌న్యూస్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Apr 17, 2024 | 7:04 PMUpdated Apr 17, 2024 | 7:04 PM
ధోని ఫ్యాన్స్‌కి సూపర్ గుడ్ న్యూస్! రైనా ఇచ్చిన లీక్‌కి దేశం షేక్!

ధోనికి ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా కూడా ధోని అంటే పడిచచ్చిపోయే అభిమానులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ధోనిని చాలా మంది అభిమానిస్తారు. కేవలం తలా ధోని ఆట చూసేందుకే వేల మంది ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం స్టేడియానికి వస్తున్నారు. ధోని బ్యాటింగ్‌కి రావాలని సొంత టీమ్‌ బ్యాటర్లు అవుట్‌ కావాలని కూడా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారంటే వాళ్ల అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అది ధోని రేంజ్‌ను తెలియజేస్తోంది. అయితే.. ఈ ఐపీఎల్‌ సీజనే ధోనికి చివరి ఐపీఎల్‌ అంటూ చాలా మంది అనుకుంటున్నారు. కానీ, అదంతా నిజం కాదని ధోనికి అత్యంత సన్నిహితుడు చిన్న తలా చెప్పాడు.

ధోని అభిమానులకు పండుగ లాంటి వార్తను అందించాడు సురేష్‌ రైనా. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రైనా.. ఇదే విషయంపై యాంకర్‌ అడిగిన ప్రశ్నకు అంటే.. ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ సీజనా? ఐపీఎల్‌ 2025 సీజన్‌ కూడా ఆడతాడా? అని ఎదురైన ప్రశ్నకు రైనా ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు. ‘ఆడతాడు’ అని చెప్పేశాడు. ఇటీవల ధోనిని రైనా కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భవిష్యత్త్‌ ప్రణాళికల గురించి ధోని రైనాతో కీలక విషయాలు పంచుకుని ఉంటాడని, అందుకే రైనా ఇంత కాన్ఫిడెంట్‌గా ఐపీఎల్‌ 2025 సీజన్‌లో కూడా ఆడతాడని చెప్పినట్లు క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు.

Good news for Dhoni fans!

అయితే.. ఇటీవల చెన్నై సూపర్‌ కింగ్స​, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని ఎలాంటి బ్యాటింగ్‌ చేశాడో అంతా చూశారు. ఇన్నింగ్స్‌ చివర్లో.. నాలుగు బంతులు మిగిలి ఉన్న సమయంలో అభిమానులు డిమాండ్‌ మేరకు ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. 4 బంతుల్లో ఏకంగా 20 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా వేసిన ఆ ఓవర్‌లో వరుసగా మూడు భారీ సిక్సులు బాదిన ధోని.. అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చాడు. అయితే.. అది కేవలం ఎంటటైన్‌ ఇన్నింగ్స్‌ మాత్రమే కాదు.. మ్యాచ్‌ విన్నింగ్‌ ఫినిషింగ్‌ కామియోగా కూడా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌లోనూ ధోని ఎంతో చురుగ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 సీజన్‌ కూడా ధోని ఆడతాడనే అంతా బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే రైనా చేసిన వ్యాఖ్యలు కూడా తోడయ్యాయి. మరి ధోని 2025 ఐపీఎల్‌ కూడా ఆడతాడనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş