iDreamPost
android-app
ios-app

మిస్టర్ పర్ ఫెక్ట్ గా కనిపించే ధోని.. ఈ హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపాడని మీకు తెలుసా?

  • Author Soma Sekhar Updated - 05:25 PM, Fri - 7 July 23
  • Author Soma Sekhar Updated - 05:25 PM, Fri - 7 July 23
మిస్టర్ పర్ ఫెక్ట్ గా కనిపించే ధోని.. ఈ హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపాడని మీకు తెలుసా?

మహేంద్రసింగ్ ధోనీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. జూలై 7 తన 42వ బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్నాడు ఈ మిస్టర్ కూల్ కెప్టెన్. దాంతో వరల్డ్ వైడ్ గా ఉన్న ధోని అభిమానులు అతడి బర్త్ డే వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ కటౌట్స్ పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా.. ధోనీ బర్త్ డే సందర్భంగా.. అతడి కెరీర్ లో జరిగిన హైలైట్స్ ను గుర్తుకు తెస్తున్నారు నెటిజన్లు. అందులో భాగంగానే.. ధోని గతంలో హీరోయిన్స్ తో నడిపిన లవ్ ఎఫైర్స్ గురించి కూడా చర్చించుకుంటున్నారు. మరి ధోని లవ్ ఎఫైర్స్ నడిపిన ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పుడంటే పెళ్లి చేసుకుని బుద్దిగా ఉంటున్నాడు గానీ.. పెళ్లి కాక ముందు మనోడు మంచి కళాకారుడే. బాలీవుడ్ హీరోయిన్స్ మెుదలు కొని టాలీవుడ్ హీరోయిన్స్ వరకు ఎవర్నీ వదలకుండా లవ్ ఎఫైర్స్ నడిపాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి అప్పట్లో ధోనీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణె నుంచి దక్షిణాది భామ రాయ్ లక్ష్మి వరకు ప్రేమాయణాలు నడిపాడని అనేక గాసిప్స్ హల్ చల్ చేశాయి. ఇక దీపిక పదుకోణె కోసం ధోని ఏకంగా తన హెయిర్ స్టైల్ నే మార్చుకున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అదీకాక దీపిక కోసం యువరాజ్ సింగ్ సైతం పోటీపడటంతో.. ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

కాగా.. దీపికతో పాటుగా సౌత్ ఇండియన్ హీరోయిన్ ఆసిన్ తో కూడా ధోని లవ్ స్టోరీ నడిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆసిన్ ఓ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోవడంతో.. ఆ వార్తలకు చెక్ పడింది. ఇక ఇక్కడితో ధోని ఆగాడా.. అంటే ఆగలేదనే వార్తలు వినిపించాయి. దానికి కారణం.. హీరోయిన్ లక్ష్మీ రాయ్. చాలా రోజుల పాటు వీరిద్దరు ప్రేమించుకున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. అదీకాక ధోనీ బయోపిక్ లో లవర్ పాత్ర లక్ష్మీరాయ్ దే నని, బ్రేకప్ కావడంతో.. సినిమాలో ఆ పాత్ర చనిపోయినట్లు చూపించారని ప్రచారం కూడా జరిగింది. ఇక ఈ రూమర్లన్నింటికీ ముగింపు పలుకుతూ.. 2010లో సాక్షి సింగ్ ను పెళ్లి చేసుకున్నాడు. కాగా.. పెళ్లి తర్వాత ధోని మిస్టర్ పర్ ఫెక్ట్ గా మారాడు.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet