Nidhan
MS Dhoni To Be Retained As Uncapped Player: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఇంకా ఐపీఎల్లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు లెజెండ్ ధోని. అయితే నెక్స్ట్ సీజన్లో అతడు ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
MS Dhoni To Be Retained As Uncapped Player: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఇంకా ఐపీఎల్లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు లెజెండ్ ధోని. అయితే నెక్స్ట్ సీజన్లో అతడు ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Nidhan
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఇంకా ఐపీఎల్లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు లెజెండ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని అన్నీ తానై నడిపిస్తున్నాడు. తాను వెళ్లాక కూడా టీమ్ బాగా పెర్ఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించి చూశాడు. కానీ అతడు ఫెయిలయ్యాడు. అయితే ఈ సీజన్లో యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఆ రోల్ ఇచ్చాడు. సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరుకోకపోయినా రుతురాజ్ కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. ధోని అండతో టీమ్‌ను బాగానే నడిపించాడు. చెన్నై జట్టు క్రమంగా సెట్ అవుతోంది కాబట్టి నెక్స్ట్ సీజన్లో మాహీ ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో అతడి కోసం భారత క్రికెట్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ధోని ఇంకొన్నాళ్లు జట్టుతోనే ఉండాలని భావిస్తున్న సీఎస్కే యాజమాన్యం అతడ్ని వదులుకోకూడదని ఫిక్స్ అయింది. అయితే ఈ ఏడాది ఆఖర్లో మెగా ఆక్షన్ ఉండటంతో మాహీని రీటెయిన్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అతడి కోసం భారీ మొత్తాన్ని వెచ్చిస్తారా? అనేది అనుమానంగా మారింది. అయితే అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనీని దక్కించుకోవాలనేది చెన్నై ప్లాన్ అని తెలిసింది. రీసెంట్గా బీసీసీఐతో ఫ్రాంచైజీల మీటింగ్‌లో ఇదే విషయాన్ని సీఎస్కే స్పష్టంగా చెప్పిందట. దీనిపై బోర్డు నిర్ణయం తీసుకుందని సమాచారం. మాహీని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రకటించడం కోసం పాత రూల్‌ను మళ్లీ తీసుకురానుందట బోర్డు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరై 5 ఏళ్లు దాటిన ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రకటించే నిబంధనను మళ్లీ పునరుద్ధరిస్తోందట.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై ఐదేళ్లు దాటిన ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ప్రకటించే రూల్ ఐపీఎల్-2008 నుంచి ఐపీఎల్-2021 వరకు అమల్లో ఉండేది. అయితే దీనిపై విమర్శలు రావడంతో తీసేశారు. అలాంటి నిబంధనను ఇప్పుడు ధోని కోసం బీసీసీఐ మళ్లీ తీసుకొస్తుందని వినిపిస్తోంది. అయితే ఈ రూల్‌పై ఫ్రాంచైజీలతో జరిగిన మీటింగ్‌లో సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్ సీరియస్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఈ రూల్ తీసుకొస్తే అది ధోనీని అవమానించినట్లు అవుతుందని.. అంతటి స్థాయి ఆటగాడ్ని ఇలా అన్క్యాప్డ్గా ప్రకటించడం కరెక్ట్ కాదని ఆమె సీరియస్ అయ్యారట. అయినా ఆమె మాట వినకుండా సీఎస్కే రిక్వెస్ట్‌కు బోర్డు ఓకే చెప్పిందని టాక్. ఒకవేళ ఈ రూల్ అమల్లోకి వస్తే మాహీ నెక్స్ట్ ఐపీఎల్ ఆడటం ఖాయమనే చెప్పాలి. మరి.. ధోని కోసం బీసీసీఐ రూల్‌ను మార్చడం కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
MS DHONI SET TO BE RETAINED AS AN UNCAPPED PLAYER…!!!
– The BCCI likely to approve the rule which allows a player who retired 5 years ago from international cricket in the ‘uncapped’ players category. (News18). pic.twitter.com/a8lZEKXGau
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2024