MS Dhoni Supported Kohli And Rohit: ధోని సపోర్ట్ వల్లే రోహిత్, కోహ్లీ ఈ స్థాయిలో ఉన్నారు.. శార్దూల్ కామెంట్స్!

Rohit-Kohli: ధోని సపోర్ట్ వల్లే రోహిత్, కోహ్లీ ఈ స్థాయిలో ఉన్నారు.. శార్దూల్ కామెంట్స్!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్​పై పేస్ ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్లిద్దరి సక్సెస్ వెనుక ఓ పవర్ ఉందన్నాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్​పై పేస్ ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్లిద్దరి సక్సెస్ వెనుక ఓ పవర్ ఉందన్నాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్​కు మూలస్థంభాలుగా ఉన్న ఆటగాళ్లు. దాదాపు పదిహేనేళ్లుగా ఇద్దరూ కలసి ఆడుతున్నారు. ఎన్నో మ్యాచుల్లో టీమ్​కు విజయాలు అందించారు. అద్భుతమైన బ్యాటింగ్​తో జట్టును ఛాంపియన్​ను చేశారు. మూడు ఫార్మాట్లలోనూ భారత్ హవా ఇంతగా నడుస్తోందంటే ఈ ఇద్దరు లెజెండ్స్ వల్లేనని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆటగాళ్లుగా రాణిస్తూనే ఇద్దరూ కెప్టెన్స్​గానూ ఆకట్టుకున్నారు. రోహిత్ ఇంకా సారథిగా కొనసాగుతున్నాడు. చిరకాల కోరికగా ఉన్న టీ20 వరల్డ్ కప్​ను కూడా జట్టుకు అందించారు. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న రోకో జోడీ ఒకప్పుడు టీమ్​లో ప్లేస్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. తీవ్ర పోటీ ఉండటంతో జట్టులో స్థానం కోసం ఎప్పుడూ ఫైట్ తప్పేది కాదు.

రోహిత్-కోహ్లీ కెరీర్​లో ఇంతగా సక్సెస్ అవడం వెనుక వాళ్ల పోరాటం, కృషి, కష్టంతో పాటు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సపోర్ట్ కూడా ఉంది. మాహీ హయంలో ఆడుతూ ఈ ఇద్దరూ టీమ్​లో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత కాలంలో సీనియర్లుగా మారి సారథ్య పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు మోడర్న్ లెజెండ్స్​గా, టీమిండియాకు మూలస్తంభాలుగా కొనసాగుతున్నారు. ధోని అండ లేకపోతే రోకో జోడీ అంతగా విజయవంతం అయ్యేవారు కాదని చాలా మంది లెజెండ్స్ చెప్పడం తెలిసిందే. తాజాగా పేస్ ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కష్టకాలంలో మాహీ ఇచ్చిన సపోర్ట్ వల్లే వాళ్లిద్దరూ ఇక్కడిదాకా వచ్చారన్నాడు శార్దూల్.

‘భారత క్రికెట్​పై ధోని వేసిన ముద్ర మామూలుది కాదు. టీ20, వన్డే వరల్డ్ కప్​తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియాకు అందించాడు. అలాగే తన సారథ్యంలో ఎంతో మంది యంగ్​స్టర్స్​కు అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేశాడు. ప్రస్తుత తరంలో గ్రేటెస్ట్ ప్లేయర్స్​గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి కూడా అతడు అండగా నిలిచాడు. టీమ్​లో నుంచి తీసేసినప్పుడు వాళ్లకు సపోర్ట్​గా నిలబడ్డాడు. ఛాన్సులు ఇచ్చి టీమ్​లో సెటిల్ అయ్యేలా చేశాడు. అందుకే 2012 తర్వాత నుంచి రోహిత్, కోహ్లీ అద్భుతాలు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ అదే రీతిలో ఆడుతున్నారు’ అని శార్దూల్ చెప్పుకొచ్చాడు. ధోనీతో కలసి ఆడటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నాడు. వేలు పెట్టి నడిపించడం అతడికి ఇష్టం ఉండదని, ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇచ్చి సొంత ఆలోచనలతో ఎదిగేలా చేయడం మాహీ స్టైల్ అని వివరించాడు.

Show comments