ధోని నోటా ‘థలా ఫర్‌ ఏ రీజన్‌’! ఫ్యాన్స్‌ కచ్చితంగా చూడాల్సిన వీడియో

MS Dhoni, Thala for a Reason: థలా ఫర్‌ ఏ రీజన్‌.. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వారికి ఈ పదం బాగా తెలిసి ఉంటుంది. ఈ మాట ఇప్పుడు ధోని నోట వచ్చింది.. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

MS Dhoni, Thala for a Reason: థలా ఫర్‌ ఏ రీజన్‌.. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వారికి ఈ పదం బాగా తెలిసి ఉంటుంది. ఈ మాట ఇప్పుడు ధోని నోట వచ్చింది.. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ఎంత భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ధోనిని ఆరాధిస్తారు, అభిమానిస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా.. ధోని క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఇంచు కూడా తగ్గలేదు. భారత్‌ మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా ధోని పేరు భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడింది. 2007లో టీ20 వరల్డ్‌ కప్‌, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీలు ధోని కెప్టెన్సీలోనే టీమిండియా గెలిచింది. అందుకే ధోనిని మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ ఇండియన్‌ కెప్టెన్‌ అంటారు. ఇప్పటికీ ధోని అభిమానులు ప్రతి విషయంలో ధోనిని తల్చుకుంటూ.. ‘థలా ఫర్‌ ఏ రీజన్‌’ అంటూ తమ అభిమానం చాటుకుంటూ ఉంటారు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాన్‌ క్రికెట్‌ లవర్స్‌కు కూడా ‘థలా ఫర్‌ ఏ రీజన్‌’ అనే ​క్యాప్షన్‌ గురించి తెలిసే ఉంటుంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పదం చాలా పాపులర్‌. ధోని జెర్సీ నంబర్‌ 7తో ఏ ఇన్సిడెంట్‌ సరిపోలినా.. థలా ఫర్‌ ఏ రీజన్‌ అంటూ కొంతమంది సరదాగా కూడా పేర్కొంటూ ఉంటారు. ఇప్పుడా పదం సాక్ష్యాత్తు ధోని నోట కూడా పలికింది.. ‘థలా ఫర్‌ ఏ రీజన్‌’ అంటూ ధోని అన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో తన అభిమానుల గురించి మాట్లాడుతూ.. నేను కూడా ఆ పదం గురించి సోషల్‌ మీడియాలోనే చూశాను. ఆ అభిమానుల విషయంలో నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. నాకు అవసరమైన సమయంలో సోషల్‌ మీడియాలో వాళ్లే నన్ను డిఫెండ్‌ చేస్తారు, అవసరమైన సమయంలో నన్ను ప్రశంసిస్తారు.. నాకు ఏ విషయంపై కూడా డిఫెండ్‌ చేసే అవసరం రాదు. నేను ఎప్పుడో ఒకసారి ఒక పోస్ట్‌ చేస్తే దాన్ని లైక్‌ చేస్తారు, ఆ పోస్ట్‌ కోసం వెయిట్‌ చేస్తారు.. థలా ఫర్‌ ఏ రీజన్‌’ అంటూ పేర్కొన్నాడు. అంటే.. సోషల్‌ మీడియాలో తనను ఎవరైనా ఏదైనా అన్నా కూడా తన ఫ్యాన్స్‌ తనపై వచ్చిన విమర్శలను డిఫెండ్‌ చేస్తారని, తన తరఫున వాళ్లు ఫైట్‌ చేయడంతో వాటిపై స్పందించే అవసరం కూడా తనకు రాదనే ఉద్దేశంలో ధోని అన్నాడు. మరి ధోని చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments