MS Dhoni: తన ఫేవరెట్ బౌలర్ ఎవరో చెప్పేసిన ధోని! ఎవరంటే?

MS Dhoni: తన ఫేవరెట్ బౌలర్ ఎవరో చెప్పేసిన ధోని! ఎవరంటే?

తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ప్రస్తుతం టీమిండియాలో తన ఫేవరెట్ బౌలర్ పేరును రివీల్ చేశాడు. మరి ధోని ఫేవరెట్ బౌలర్ ఎవరంటే?

తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ప్రస్తుతం టీమిండియాలో తన ఫేవరెట్ బౌలర్ పేరును రివీల్ చేశాడు. మరి ధోని ఫేవరెట్ బౌలర్ ఎవరంటే?

మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న దిగ్గజ ఆటగాడు. టీమిండియా చిరకాల స్వప్నం అయిన వరల్డ్ కప్ ను అందించడంతో పాటుగా.. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను కూడా భారత్ కు అందించిన యోధుడు. రిటైర్మెంట్ తర్వాత కేవలం ఐపీఎల్ కు మాత్రమే పరిమితం అయ్యాడు ఈ స్టార్ ప్లేయర్. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడికి ప్రస్తుతం టీమిండియాలో నీ ఫేవరెట్ బౌలర్, బ్యాటర్ ఎవరు? అన్న ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ధోని ఆన్సర్ ఏం చెప్పాడో తెలుసా?

ప్రస్తుతం టీమిండియాలో ఉన్న బౌలర్లలో తన ఫేవరెట్ బౌలర్ ఎవరో రివీల్ చేశాడు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి నీ ఫేవరెట్ బౌలర్, బ్యాటర్ ఎవరు? అన్న ప్రశ్న ఎదురైంది. దానికి ధోని సమాధానం ఇస్తూ..”టీమిండియాలో నా ఫేవరెట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. కానీ బ్యాటర్ మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే మన జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. అందులోంచి ఒకరిని ఎన్నుకోవడం కష్టం. ఇక మిగతా బౌలర్లు కూడా గొప్పవారే. కానీ నా ఫేవరెట్ బుమ్రా అని చెబుతున్నా అంతే. జట్టులో ఏ బ్యాటర్ ని చూసినా గ్రేట్ అనిపిస్తున్నారు. అందుకే ఏ ఒక్కరి పేరో చెప్పడం నాకు ఇష్టం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని.

ఇదిలా ఉండగా.. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని, ఐపీఎల్ ఒక్కటే ఆడుతున్నాడు. అయితే ఏజ్, ఫిట్ నెస్ దృష్ట్యా వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడతాడా? లేదా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు జరగబోయే మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని రిటైన్ చేసుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ధోని ఇప్పటి వరకు తన ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. ధోని అందుబాటులో ఉంటే తప్పకుండా రిటైన్ చేసుకుంటామని సీఎస్కే యాజమాన్యం స్పష్టం చేసింది.

Show comments