iDreamPost
android-app
ios-app

అంచనాలు పెంచి.. తుస్సుమనిపించిన ధోని! న్యూ రోల్‌ అంటూ..

  • Published Mar 06, 2024 | 1:03 PM Updated Updated Mar 06, 2024 | 1:03 PM

MS Dhoni, Jio Cinema: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని తన కొత్త రూల్‌ ఏంటో రివీల్‌ చేశాడు. ఫేస్‌బుక్‌లో తన కొత్త రూల్‌ అంటూ ఒక పోస్ట్‌ చేసి.. అభిమానుల్లో ఊహగానాలకు తెరలేపిన ధోని.. తాజాగా ఆ విషయాన్ని రివీల్‌ చేశాడు. అదేంటో మీరూ తెలుసుకోండి..

MS Dhoni, Jio Cinema: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని తన కొత్త రూల్‌ ఏంటో రివీల్‌ చేశాడు. ఫేస్‌బుక్‌లో తన కొత్త రూల్‌ అంటూ ఒక పోస్ట్‌ చేసి.. అభిమానుల్లో ఊహగానాలకు తెరలేపిన ధోని.. తాజాగా ఆ విషయాన్ని రివీల్‌ చేశాడు. అదేంటో మీరూ తెలుసుకోండి..

  • Published Mar 06, 2024 | 1:03 PMUpdated Mar 06, 2024 | 1:03 PM
అంచనాలు పెంచి.. తుస్సుమనిపించిన ధోని! న్యూ రోల్‌ అంటూ..

ప్రస్తుతం క్రికెట్‌ అభిమానుల్లో ఐపీఎల్‌ ఆరంభం గురించి టాక్‌ నడుస్తుంది. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో తమ తమ అభిమాన జట్ల బలాలు, బలహీనతల గురించి చర్చించుకుంటున్నారు. అలాగే స్టార్‌ టీమ్స్‌ అయిన సీఎస్‌కే, ఆర్సీబీ, ముంబై ఎలాగో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా ఉంటాయి. ఎందుకంటే ఆయా జట్లలో ధోని, కోహ్లీ, రోహిత్‌ ఉన్నారు కాబట్టి. ఆ టీమ్స్‌కు సంబంధించి, లేక ఆ ఆటగాళ్లు సంబంధించిన ఏ విషయం బయటికి వచ్చిన హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ధోని చేసిన ఒక ఫేస్‌బుక్‌ పోస్టు కూడా సంచలనంగా మారింది. ‘కొత్త సీజన్, కొత్త ‘పాత్ర’ కోసం వేచి ఉండలేకపోతున్నాను. అదేంటో తెలుసుకోవడానికి ఎదురుచూడండి!’ అంటూ ఒక పోస్ట్‌ చేశాడు ధోని. దాంతో ధోని కొత్త రోల్‌ ఏంటో అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా తెగ చర్చించుకున్నారు.

సీఎస్‌కే కెప్టెన్‌గా తప్పుకుంటాడా? మెంటర్‌గా ఉంటాడా? అసలు ఐపీఎల్‌ ఆడతాడా లేదా? అంటే చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ, వాటంన్నింటిని తుస్సుమనిపిస్తూ.. ఓ యాడ్‌లో ముసలి వ్యక్తి గెటప్‌లో కనిపించి.. ఇదే ఆ కొత్త రోల్‌ అంటూ అందరిని నిరాశరిచాడు ధోని. ప్రస్తుతం ధోని జియో యాడ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యాడ్‌లో ధోని యంగ్‌ మ్యాన్‌గా అలాగే ఓల్డ్‌ మ్యాన్‌గా నటించాడు. ఈ యాడ్‌ కోసమే ధోని ఆ పోస్ట్‌ చేశాడని తెలిసి క్రికెట్‌ ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. ఏదో ఊహించుకుంటే.. ఇలా షాకిచ్చాడు అంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetHoliganbet girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş