iDreamPost
android-app
ios-app

MS Dhoni: మాల్దీవుల వివాదం.. భారత పర్యాటక రంగంపై ధోని కామెంట్స్ వైరల్!

  • Published Jan 09, 2024 | 3:51 PM Updated Updated Jan 10, 2024 | 2:47 PM

మాల్దీవుల వివాదం నేపథ్యంలో.. భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని భారతదేశ పర్యాటక రంగంపై మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఇంతకీ ధోని ఆ వీడియోలో ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం.

మాల్దీవుల వివాదం నేపథ్యంలో.. భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని భారతదేశ పర్యాటక రంగంపై మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఇంతకీ ధోని ఆ వీడియోలో ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం.

  • Published Jan 09, 2024 | 3:51 PMUpdated Jan 10, 2024 | 2:47 PM
MS Dhoni: మాల్దీవుల వివాదం.. భారత పర్యాటక రంగంపై ధోని కామెంట్స్ వైరల్!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న సుందర ప్రదేశాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మోదీ. అయితే ప్రధాని లక్షద్వీప్ లో పర్యటించడంపై మాల్దీవులకు చెందిన కొంత మంది రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత పర్యాటక రంగాన్ని తక్కువ చేస్తూ.. మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్స్ కు అదే రీతిలో స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు. టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, హార్దిక్ పాండ్యా,సచిన్ టెండుల్కర్, సురేశ్ రైనాతో పాటుగా బాలీవుడ్ దిగ్గజ యాక్టర్ అమితాబ్ బచ్చన్ సైతం గట్టిగా స్పందించారు. మన దేశంలో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని, వాటికి ప్రాచూర్యం కల్పించాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టారు. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని భారతదేశ పర్యాటక రంగంపై మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఇంతకీ ధోని ఆ వీడియోలో ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం.

మహేంద్రసింగ్ ధోని.. క్రికెట్ లో ఉన్నప్పుడే కాదు, రిటైర్మెంట్ అయ్యాక కూడా ట్రెండింగ్ లోనే ఉంటూ.. వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవలే ధోని హుక్కా తాగిన వీడియోలు వైరల్ కాగా.. అతడిపై విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ధోని భారత పర్యాటక రంగంపై మాట్లాడిన ఓ పాత వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం మాల్దీవుల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత్ కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు. ఇండియాలోనూ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయని, వాటికి ప్రాచూర్యం కల్పించాలని సోషల్ మీడియా వేదికగా వారు పోస్ట్ లు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో భారత పర్యాటక రంగంపై గతంలో ధోని మాట్లాడిన ఓ పాత వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ధోని ఏం మాట్లాడాడు అంటే?..”నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు నా కెరీర్ లో ఎన్నో ప్రయాణాలు చేశాను. అయితే అవి వెకేషన్స్ కోసం కాదు. క్రికెట్ ఆడటానికి ఆయా దేశాలకు వెళ్లాను. అప్పుడు అక్కడి దర్శనీయ ప్రదేశాలు చూడకుండా.. మ్యాచ్ లు ముగిసిన వెంటనే ఇండియాకు తిరిగి వచ్చే వాళ్లం. కానీ నా భార్యకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం మాకు కొంచెం సమయం దొరుకుతోంది. దీంతో వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నాం. అయితే భారతదేశం నుంచే ఈ టూర్ ను ప్రారంభించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇండియాలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. బయటి దేశాల్లో ఉన్న ప్రాంతాలకు వెళ్లే ముందు ఇండియాలో ఉన్న అన్ని సుందరమైన దర్శనీయ ప్రాంతాలను చూడాలనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు మిస్టర్ కూల్. ప్రస్తుతం ధోని మాట్లాడిన ఈ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom