iDreamPost
android-app
ios-app

మహేశ్ బాబును తలపిస్తున్న ధోని న్యూ లుక్! వైరలవుతున్న పిక్..

  • Author Soma Sekhar Published - 12:53 PM, Tue - 3 October 23
  • Author Soma Sekhar Published - 12:53 PM, Tue - 3 October 23
మహేశ్ బాబును తలపిస్తున్న ధోని న్యూ లుక్! వైరలవుతున్న పిక్..

మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత తనకు ఇష్టమైన వ్యాపకాలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ధోనికి వ్యవసాయం అన్నా, బైక్ రైడింగ్ అన్న ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే ఈ మిస్టర్ కూల్ కి టెన్నిస్ ఆట ఎంతో ఇష్టం. సమయం చిక్కినప్పుడల్లా టెన్నిస్ ఆటను ఆస్వాదిస్తూ ఉంటాడు. అయితే గత కొంతకాలంగా ధోని వెరైటీ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. తాజాగా ధోనికి సంబంధించిన లేటెస్ట్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ పిక్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును తలపిస్తున్నాడు మహేంద్రుడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన లుక్స్ తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటాడు. కొన్ని రోజులు క్రితం యూఎస్ ఓపెన్ మ్యాచ్ టైమ్ లో గుబురు గడ్డంతో కనిపించిన ధోని.. ఇటీవల పిలకతో దర్శనమిచ్చాడు. తాజాగా లూజ్ హెయిర్ తో బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని అచ్చం హీరో మహేశ్ బాబులా కనిపిస్తూ.. షాక్ కు గురిచేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సడెన్ గా చూస్తే మహేశ్ బాబులా ఉన్నావ్ ధోని అని కొందరు అంటే.. హాలీవుడ్ హీరోలా ఉన్నావ్ అంటూ మరికొందరు రాసుకొచ్చారు. ఈ ఏజ్ లో కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నావ్ ఏం తింటున్నావ్ సామీ అంటూ ఇంకొందరు సరదాగా అడుగుతున్నారు. మరి ధోని లేటెస్ట్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş