SNP
MS Dhoni, CSK vs LSG, IPL 2024: ఐపీఎల్ 2024లో ధోని సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. లాస్ట్ సీజన్ అని ఏమో కానీ అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే.. లక్నోపై మ్యాచ్ ఓడిపోవడానికి కారణం మాత్రం ధోనినే అనే వాదన వినిపిస్తోంది. దాని గురించి పూర్తి తెలుసుకుందాం..
MS Dhoni, CSK vs LSG, IPL 2024: ఐపీఎల్ 2024లో ధోని సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. లాస్ట్ సీజన్ అని ఏమో కానీ అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే.. లక్నోపై మ్యాచ్ ఓడిపోవడానికి కారణం మాత్రం ధోనినే అనే వాదన వినిపిస్తోంది. దాని గురించి పూర్తి తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో ధోని మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇదే తనకు చివరి ఐపీఎల్ సీజన్ అని చాలా మంది భావిస్తున్నారు. కేవలం తన అభిమానుల కోసం 42 ఏళ్ల వయసులో కూడా ధోని ఎంతో కష్టపడి ఐపీఎల్ ఆడుతున్నాడని, పైగా చివర్లో వచ్చి భారీ సిక్స్‌లతో తన కోసం స్టేడియానికి వచ్చే క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోని 9 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేశాడు. అంతకు ముందు ధోని ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 4 బంతుల్లోనే 20 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇలా చివర్లో సూపర్ బ్యాటింగ్‌తో టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గ నిలుస్తున్నాడు ధోని.
అయితే.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. దీంతో చెన్నై ఓటమికి కారణం ధోనినే అని కొంతమంది క్రికెట్ అభిమానులు అంటున్నారు. 160, 165 పరుగులకే పరిమితం అయ్యే టీమ్‌కు.. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో 9 బంతుల్లోనే 28 పరుగులు చేసి.. 176 పరుగుల మంచి స్కోర్ అందించిన ధోని.. ఎలా చెన్నై ఓటమికి కారణం అవుతాడని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ, ధోనిని విమర్శించే వాళ్లు చెప్పే లెక్కలు వేరేలా ఉన్నాయి. అవేంటంటే.. ధోని ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి ధోని ముందుగా బ్యాటింగ్‌కి రావొచ్చు కదా అని వారు అంటున్నారు.
తాను ముందుగా బ్యాటింగ్‌కి రాకుండా లోయర్ ఆర్డర్‌లో వచ్చే రవీంద్ర జడేజాను ముందు బ్యాటింగ్‌కి పంపాడు. జడేజా 57 పరుగులు చేసి రాణించినా.. ఆ 57 పరుగులు చేసేందుకు 40 బంతులు తీసుకున్నాడు. కేవలం 142 స్ట్రైక్‌రేట్‌తో మాత్రమే అతను బ్యాటింగ్ చేశాడు. అదే సూపర్ ఫామ్‌లో ఉన్న ధోని ముందుగా బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే.. అతను ఆడే అగ్రెసివ్ బ్యాటింగ్‌కి సీఎస్‌కే స్కోర్ కచ్చితంగా 190 వరకు వెళ్లేదని అంటున్నారు. కానీ, ముందుగా బ్యాటింగ్‌కి వస్తే.. ఎక్కడ త్వరగా అవుట్ అవుతానేమో అని భయపడి, చివర్లో తక్కువ బంతులు ఉన్నప్పుడు బ్యాట్ ఊపేస్తూ కొన్ని రన్స్ చేస్తున్నాడని, ఇప్పుడు లక్నోతో మ్యాచ్‌లో ధోని చేసిన ఈ తప్పుతోనే చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిందని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni Six and Ravi Shastri Commentary ! Box office Stuff. pic.twitter.com/r09hymX3Xp
— 🎰 (@StanMSD) April 19, 2024