iDreamPost
android-app
ios-app

MS Dhoni: ఫ్రెండ్​ సాయాన్ని మర్చిపోని ధోని.. అతడి రుణం తీర్చుకునేందుకు ఏకంగా..!

  • Published Feb 08, 2024 | 1:30 PM Updated Updated Feb 08, 2024 | 1:30 PM

భారత లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా క్రికెట్​లోకి అడుగుపెట్టిన మాహీ.. ఆ తర్వాత కాలంలో గేమ్​కు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్​గా మారాడు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాల్ని మాత్రం అతడు మర్చిపోలేదు.

భారత లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా క్రికెట్​లోకి అడుగుపెట్టిన మాహీ.. ఆ తర్వాత కాలంలో గేమ్​కు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్​గా మారాడు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాల్ని మాత్రం అతడు మర్చిపోలేదు.

  • Published Feb 08, 2024 | 1:30 PMUpdated Feb 08, 2024 | 1:30 PM
MS Dhoni: ఫ్రెండ్​ సాయాన్ని మర్చిపోని ధోని.. అతడి రుణం తీర్చుకునేందుకు ఏకంగా..!

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్​కు ఎప్పుడో గుడ్​బై చెప్పేశాడు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో మాత్రమే ఆడుతూ వస్తున్నాడు మాహీ. గతేడాది ఐపీఎల్ అతడికి లాస్ట్ సీజన్ అంటూ వార్తలు వచ్చాయి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచులకు అభిమానులు వేలాదిగా పోటెత్తారు. గతేడాది టైటిల్​ను సీఎస్​కేనే ఎగరేసుకుపోయింది. తన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్​ను ఉపయోగించుకొని టీమ్​ను మరోమారు ఛాంపియన్​ను చేశాడు ధోని. అయితే రిటైర్మెంట్ మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఆ సీజన్ ముగిసిన తర్వాత గాయానికి ట్రీట్​మెంట్ చేయించుకున్న ధోని ఇప్పుడు ఫిట్​నెస్ సాధించాడు. ఐపీఎల్ నెక్స్ట్ సీజన్ కోసం అతడు సిద్ధమవుతున్నాడు. ఇక, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా క్రికెట్​లో ఈ స్థాయికి చేరుకున్న ధోని.. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాల్ని మాత్రం మర్చిపోలేదు. అందుకు తాజా ఘటనే ఉదాహరణ. చిన్నతనంలో తనకు సాయం చేసిన ఫ్రెండ్ రుణాన్ని ఇప్పుడు తీర్చుకున్నాడు మాహీ.

క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్​కు ఇంకో నెల రోజుల సమయమే ఉండటంతో ధోని ప్రాక్టీస్​లో వేగం పెంచాడు. తాజాగా రాంచీలో అతడు బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. అయితే మాహీ వాడుతున్న బ్యాట్​ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. అలాగని అది ఏ పెద్ద కంపెనీ బ్యాటో అనుకుంటే పొరబడ్డట్లే. ధోని బ్యాట్ మీద కనిపించిన లోగో ఏ కంపెనీదీ కాదు. ఆ స్టిక్కర్ మీద మాహీ ఫ్రెండ్ షాప్ పేరు రాసి ఉంది. అప్పట్లో తనకు సాయం చేసిన మిత్రుడి రుణం తీర్చుకునేందుకే అతడి దుకాణం పేరుతో ఉన్న స్టిక్కర్ అతికించిన బ్యాటుతో ధోని ప్రాక్టీస్ చేశాడు. సీఎస్​కే కెప్టెన్ చిన్నప్పటి స్నేహితుడు పరమ్​జీత్ సింగ్​కు ప్రైమ్ స్పోర్ట్స్ అనే ఓ షాప్ ఉంది. ఇందులో అన్ని రకాల క్రికెట్ కిట్స్​తో పాటు జెర్సీలు, ఇతర ఆట సామాగ్రి కూడా లభిస్తాయి. దీంతో తన ఫ్రెండ్ షాప్​కు మరింత పాపులారిటీ తీసుకొచ్చేందుకు ధోని ఆ ప్రైమ్ స్పోర్ట్స్ సిక్కర్ ఉన్న బ్యాటుతో సాధన చేశాడు.

ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాటుతో ధోని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియాకు టీ20, వన్డే వరల్డ్ కప్స్​తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అందించిన మాహీ.. తన కెరీర్​లో ఎన్నో బ్యాట్​లు ఉపయోగించాడు. కానీ తన ఫ్రెండ్ షాపు పేరుతో ఉన్న బ్యాటుతో కనిపించడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. దీన్ని చూసిన వాళ్లంతా ధోని చాలా స్పెషల్ అని.. తన ఫ్రెండ్ కోసం అతడు చేస్తున్న పనిని మెచ్చుకోకుండా ఉండలేమని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, తాను ఈ స్థాయిలో ఉండేందుకు చిన్ననాటి స్నేహితులు చేసిన సాయం కారణమని ధోని చాలాసార్లు చెప్పాడు. అతడి లైఫ్​పై తీసిన బయోపిక్​లోనూ మాహీ ఫ్రెండ్​ను, ఆ షాపును ప్రత్యేకంగా చూపించారు. మరి.. చిన్ననాటి మిత్రుడికి ధోని చేస్తున్న సాయంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişberlinbet girişgrandpashabet