SNP
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఇండియన్ క్రికెట్‌కు ఎంతో చేశాడు. మూడు ఐసీసీ ట్రోఫీలనే కాకుండా ఓ మంచి కెప్టెన్‌ను కూడా టీమిండియా అందించి వెళ్లాడు. అయితే.. ధోని తాను చివరి మ్యాచ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఇండియన్ క్రికెట్‌కు ఎంతో చేశాడు. మూడు ఐసీసీ ట్రోఫీలనే కాకుండా ఓ మంచి కెప్టెన్‌ను కూడా టీమిండియా అందించి వెళ్లాడు. అయితే.. ధోని తాను చివరి మ్యాచ
SNP
మహేంద్ర సింగ్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించాల్సిన పేరు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్‌కు అందించిన ఏకైక కెప్టెన్. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా.. తన కెరీర్‌లో ఇండియాకు కప్పుల పంట పండించాడు. అలాగే తన కెప్టెన్సీలో మంచి టీమ్‌ను కూడా బిల్డ్ చేశాడు. ముఖ్యంగా ఫిట్‌నెస్ విషయంలో అయితే.. ధోనికి వందకు వంద మార్కులు వేయాల్సిందే. ఫిట్‌నెస్ విషయంలో సీనియర్లను సైతం ధోని సహించలేదనే వాదన ఉంది. ధోని అంత స్ట్రిక్ట్‌గా ఉండటంతోనే.. కోహ్లీ, రైనా, జడేజా లాంటి మెరికల్లాంటి ఫీల్డర్లు టీమిండియా దొరికారు. ఆ తర్వాత భారత జట్టు రూపం రేఖలే మారిపోయియి.
అయితే.. ధోని మంచి ఫిట్‌నెస్‌తో ఉంటూ, పరుగులు చేస్తున్న సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2020 ఆగస్టులో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతకంటే ముందే టెస్ట్ క్రికెట్‌కు దూరమైన ధోని.. 2017లో టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ధోని వారసుడిగా విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి.. అంతే అద్భుతంగా జట్టును నడింపిచాడు. కోహ్లీ కెప్టెన్సీలోనూ ఆడిన ధోని.. కోహ్లీకి అండగా ఉంటూ వచ్చాడు. ఇక కోహ్లీ టీమ్‌ను సమర్థవంతంగా నడిపిస్తాడని భావించిన తర్వాత.. 2020లో పూర్తిగా ఆటకు దూరం అయ్యాడు. అలా భారత జట్టును ఓ మంచి కెప్టెన్ చేతుల్లో పెట్టి.. ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు.
కాగా, తాజాగా తన రిటైర్మెంట్‌పై స్పందించిన ధోని.. కాస్త ఎమోషనల్ అయ్యాడు. నిజానికి ధోని 2020లో రిటైర్మెంట్ ప్రకటించినా.. అంతకంటే ఏడాది ముందే తాను మానసికంగా ఆటకు దూరమైనట్లు తెలిపాడు. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్ తనకు చివరి మ్యాచ్ అని పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌తోనే తాను రిటైర్మెంట్ ఇచ్చానని అన్నాడు. కానీ, అధికారంగా 2020లో తప్పుకున్నట్లు పేర్కొన్నాడు. ఆ సెమీ ఫైనల్‌లో ధోని రనౌట్ కాకుంటే టీమిండియా విజయం సాధించి ఉండేదని చాలా మంది నమ్ముతారు. ఆ ఓటమితో ధోని సైతం అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ ఓటమి ధోనిని ఎంతలా బాధపెట్టిందో తాజాగా ధోని కామెంట్స్‌తో అర్థం చేసుకోవచ్చు. అలాగే రిటైర్మెంట్ తర్వాత.. ఓ ఆటగాడు దేశానికి ప్రాతినిథ్యం వహించే గొప్ప అవకాశాన్ని కోల్పోతాడని, అది ఏ ఆటలో అయినా అంతే అన్నాడు. దేశం తరఫున ఆడటం గొప్పగా భావిస్తామని, కానీ, రిటైర్ అయితే ఆ అవకాశం ఉండదని కాస్త ఎమోషనల్ అయ్యాడు. మరి ధోని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni talking about his final day of International career.
– A sad day in indian cricket history…..!!!!pic.twitter.com/QqaRCsYzIO
— Johns. (@CricCrazyJohns) October 26, 2023