iDreamPost
android-app
ios-app

వీడియో: బైకులంటే ధోనికి ఎంత పిచ్చో చూడండి! ఫ్యాన్స్‌ ఫిదా అవ్వాల్సిందే

  • Author Soma Sekhar Published - 08:11 PM, Sat - 25 November 23

ధోనికి బైకులంటే ఎంత పిచ్చో మనందరికి తెలిసిందే. తాజాగా ఆ విషయం మరోసారి రుజువుచేశాడు మిస్టర్ కూల్. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ధోనికి బైకులంటే ఎంత పిచ్చో మనందరికి తెలిసిందే. తాజాగా ఆ విషయం మరోసారి రుజువుచేశాడు మిస్టర్ కూల్. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Published - 08:11 PM, Sat - 25 November 23
వీడియో: బైకులంటే ధోనికి ఎంత పిచ్చో చూడండి! ఫ్యాన్స్‌ ఫిదా అవ్వాల్సిందే

సెలబ్రిటీలకు ఖరీదైన కార్లు, బైక్ లు అంటే పిచ్చి ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మార్కెట్ లోకి వచ్చిన ఏ కారైనా, బైక్ అయినా.. తమ గ్యారేజ్ లో ఉండాలని అనుకుంటారు కొందరు సెలబ్రిటీలు. అందులో ముందు వరుసలో ఉంటాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత తనకు ఇష్టమైన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నాడు ధోని. ఇక ధోనికి బైకులంటే ఎంత పిచ్చో మనందరికి తెలిసిందే. తాజాగా ఆ విషయం మరోసారి రుజువుచేశాడు మిస్టర్ కూల్. తన ఫ్రెండ్ బైక్ ను తన టీ-షర్ట్ తో తుడిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహేంద్రసింగ్ ధోని.. ఇండియన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు మిస్టర్ కూల్. కాగా.. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక తనకు ఇష్టమైన పనులు చేసుకుంటూ రిలాక్స్ అవుతున్నాడు. ధోనికి బైక్స్ అన్నా.. వ్యవసాయం అన్నా విపరీతమైన ఇష్టం. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. ఇక ధోని గ్యారేజ్ లో ఉన్న స్పోర్ట్స్ బైక్స్ చూస్తే.. మనం ఔరా అనాల్సిందే. తనకు నచ్చిన బైక్ ను వెంటనే కొనేసి, దానిపై ఓ రౌండ్ వేసేదాక ఆగడు ధోని.

ఇదిలా ఉండగా.. ధోనికి బైక్స్ అంటే ఎంత పిచ్చో మరోసారి తెలియజెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో చూస్తే ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే. దాంటో ఏముందంటే? ధోని స్నేహితుడు ఒకరు కొత్త బైక్ కొని ధోని దగ్గరకు తీసుకొచ్చాడు. దానిపై ఓ ఆటోగ్రాఫ్ పెట్టమని ధోనిని అడిగాడు. కళ్లముందు ఉన్నది కొత్త బైక్.. పైగా అడిగింది దోస్తుగాడు మరి మిస్టర్ కూల్ ఆగుతాడా? ఏకంగా తన టీ-షర్ట్ తో బైక్ ను తుడిచి.. తన ఆటోగ్రాఫ్ పెట్టాడు. ఆ తర్వాత బైక్ ను స్టార్ట్ చేశాడు. ఈ సమయంలో ధోని కళ్లలో సంతోషాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. స్వయంగా తన టీ-షర్ట్ తో బైక్ తుడిచి ఆటోగ్రాఫ్ పెట్టడంతో.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి ధోని చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss