Nidhan
ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్ వారసత్వాన్ని కొనసాగించే సత్తా టీమిండియాలోని ఆ ప్లేయర్‌కే ఉందని ఆఫ్ఘాన్ స్టార్ గుర్బాజ్ అన్నాడు. అతడు ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్ చేశాడో ఇప్పుడు చూద్దాం..
ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్ వారసత్వాన్ని కొనసాగించే సత్తా టీమిండియాలోని ఆ ప్లేయర్‌కే ఉందని ఆఫ్ఘాన్ స్టార్ గుర్బాజ్ అన్నాడు. అతడు ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్ చేశాడో ఇప్పుడు చూద్దాం..
Nidhan
లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఫినిషర్లు ఉండటం చాలా కీలకం. భారీ స్కోర్లు సెట్ చేయాలన్నా, ఛేజ్ చేయాలన్నా అది వారికే సాధ్యం. అందుకే బెస్ట్ ఫినిషర్లను వెతికే పనిలో బిజీగా ఉంటారు సెలక్టర్లు. ఎవరూ దొరక్కపోతే టీమ్‌లో ఉన్నవారినే ఆ రోల్ కోసం ప్రిపేర్ చేస్తుంటారు. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్లుగా పేరు తెచ్చుకుంది మహేంద్ర సింగ్ ధోని-యువరాజ్ సింగ్ జోడీ. వీళ్లిద్దరూ ఎన్నో కీలక భాగస్వామ్యాలతో టీమిండియాకు అద్భుత విజయాలు అందించారు. టీ20 వరల్డ్ కప్-2007తో పాటు వన్డే ప్రపంచ కప్-2011లో యువీ-ధోని సూపర్బ్ పార్ట్నర్షిప్స్ నెలకొల్పి జట్టుకు కప్‌లు అందించారు. గేమ్ నుంచి ధోని, యువీ ఎగ్జిట్ అయ్యాక మళ్లీ ఆ స్థాయి ఫినిషర్లను భారత్ ప్రొడ్యూస్ చేయలేకపోయింది. అయితే టీమిండియాలో ఓ నయా ఫినిషర్ వచ్చాడని ఆఫ్ఘానిస్థాన్ క్రికెటర్ రెహ్మానుల్లా గుర్బాజ్ అన్నాడు.
టీమిండియాలో ధోని, యువరాజ్ వారసత్వాన్ని కొనసాగించే సత్తా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్‌కు ఉందన్నాడు గుర్బాజ్. ధోని, యువీకి సరైన రీప్లేస్మెంట్ రింకూనే అని చెప్పాడు. ‘రింకూ చాలా ఫన్నీ పర్సన్. అందర్నీ నవ్విస్తుంటాడు. నేను అతడ్ని చాలా ఇష్టపడతా. ఐపీఎల్ వల్ల మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ప్రస్తుతం రింకూ తన కెరీర్లో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాడు. ఇటీవల కాలంలో భారత జట్టు తరఫున అతడు ఆడిన అన్ని సిరీస్‌ల్లోనూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. క్రీజులో ఉన్నప్పుడు అతడు బంతిని మాత్రమే గమనిస్తాడు. ఏ దేశంలో ఆడినా అక్కడి పరిస్థితులకు తగ్గట్లు తనను తాను మార్చుకొని అలవాటు పడతాడు. రింకూ సూపర్బ్ క్రికెటర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. టీమిండియా ఫ్యూచర్ ఫినిషర్ రింకూనే’ అని రెహ్మానుల్లా గుర్బాజ్ చెప్పుకొచ్చాడు. అలాగే రింకూ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అని ప్రశంసించాడు.
ఇక, 26 ఏళ్ల రింకూ టీ20 క్రికెట్లో అదరగొడుతున్నాడు. అపోజిషన్ టీమ్ ఏదైనా, బౌలర్ ఎవరైనా సరే దూకుడుగా ఆడుతూ ఎడాపెడా బౌండరీలు, సిక్సులు బాదుతున్నాడు. రీసెంట్గా ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఆకట్టుకున్నాడు. శివమ్ దూబెతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మూడో టీ20లో హిట్‌మ్యాన్‌తో కలసి ఏకంగా 190 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు రింకూ. ఈ మ్యాచ్‌లో అతడు 39 బంతుల్లోనే 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిడిలార్డర్లో వచ్చి మ్యాచ్‌లను అద్భుతంగా ఫినిష్ చేస్తున్న అతడు నయా ఫినిషర్‌గా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో రింకూపై ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్మేట్ రెహ్మానుల్లా గుర్బాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రింకూను ధోని, యువీతో పోల్చాడు. మరి.. ధోని, యువరాజ్ వారసత్వాన్ని రింకూ కొనసాగిస్తాడంటూ గుర్బాజ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rahmanullah Gurbaz said, “Rinku Singh is the kind of person who makes everyone happy. He is a really funny guy, a great guy. I really love him. We have a great friendship. He can carry forward the legacy of MS Dhoni and Yuvraj Singh”. (Sports Tak). pic.twitter.com/LISvsKiUIp
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 20, 2024