SNP
తొలి నాలుగు మ్యాచ్‌లు ఆడలేదు.. అయితేనేం. ఐదో మ్యాచ్‌లో బరిలోకి దిగి ఐదు వికెట్లు పడగొట్టాడు. అది కూడా ఈ టోర్నీలో మనలాగే ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న బలమైన న్యూజిలాండ్‌పై. .. ఇదీ షమీ కమ్‌బ్యాక్ కాదు.. అది కంటిన్యూషన్. ఆసీస్‌పై 5 వికెట్ల హాల్ తర్వాత.. మళ్లీ ఇప్పుడు ఓ ఐదేసుకున్నాడు. అయితే.. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడించకపోవడంపై స్పందిస్తూ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..
తొలి నాలుగు మ్యాచ్‌లు ఆడలేదు.. అయితేనేం. ఐదో మ్యాచ్‌లో బరిలోకి దిగి ఐదు వికెట్లు పడగొట్టాడు. అది కూడా ఈ టోర్నీలో మనలాగే ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న బలమైన న్యూజిలాండ్‌పై. .. ఇదీ షమీ కమ్‌బ్యాక్ కాదు.. అది కంటిన్యూషన్. ఆసీస్‌పై 5 వికెట్ల హాల్ తర్వాత.. మళ్లీ ఇప్పుడు ఓ ఐదేసుకున్నాడు. అయితే.. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడించకపోవడంపై స్పందిస్తూ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..
SNP
మొత్తానికి ఈ వరల్డ్ కప్‌లో అతిపెద్ద గండాన్ని టీమిండియా దాటేసింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను మట్టికరిపించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీలో నాలుగేసి మ్యాచ్‌లు ఆడిన ఇండియా, న్యూజిలాండ్.. మధ్య ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ టఫ్ ఫైట్‌లా సాగింది. సమవుజ్జీల మధ్య పోరులో టీమిండియా పైచేయి సాధించి, 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది టీమిండియా. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ ఏకంగా ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అద్భుత ప్రదర్శనతో ఈ వరల్డ్ కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
అయితే.. షమీకి తొలి నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కలేదనే విషయం తెలిసిందే. జట్టు అవసరాల దృష్ట్యా షమీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం రాలేదు. బుమ్రా, సిరాజ్ అద్భుత ఫామ్‌లో ఉండటం, ఎక్స్‌ట్రా బ్యాటర్ కోసం శార్దుల్ ఠాకూర్ వైపు రోహిత్ శర్మ మొగ్గుచూపుతుండటంతో షమీకి మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు. అయితే.. షమీని బెంచ్‌లోనే కూర్చోబెట్టడంపై విమర్శలు వచ్చినా.. టీమిండియా వరుస విజయాలు సాధిస్తుండటంతో.. ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాగా, శార్దుల్‌ను ఎక్స్‌ట్రా బ్యాటర్ రూపంలో ఆడిస్తున్నా.. అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్ రాలేదు. దీంతో.. అసలు శార్దుల్ టీమ్‌లో ఎందుకు? బౌలింగ్ కూడా సరిగా చేయడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి.
దీంతో.. ధర్మశాల పరిస్థితులు షమీ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో అతన్ని బరిలోకి దింపడానికి ఇదే సరైన సమయమని భావించిన రోహిత్ శర్మ.. శార్దుల్‌ను పక్కనపెట్టి.. షమీని తీసుకొచ్చాడు. వరల్డ్ కప్‌లోకి వచ్చీ రావడంతోనే తొలి బంతికే వికెట్ తీసి తన రాకను ఘనంగా చాటుకున్నాడు షమీ. అంతేకాదు.. 300లకు పైగా పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్‌ను కేవలం 273కే ఆలౌట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం మీద ఐదు వికెట్ల హాల్ సాధించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తనను ఇన్ని రోజులు పక్కనపెడతారా? అనే కసితో బౌలింగ్ వేసినట్లు కనిపించింది. కానీ, మ్యాచ్ తర్వాత మాట్లాడిన షమీ.. తనలో అలాంటి గర్వం ఇసుమంతైన లేదని నిరూపించుకున్నాడు. తొలి 4 మ్యాచ్‌లకు తనను పక్కనపెట్టడంపై స్పందిస్తూ.. తనను ఆడించడంలేదనే బాధ అతనకు ఏ మూలనా లేదని, జట్టు అద్భుతంగా ప్రదర్శన చేస్తుందని, దాన్ని నేను అర్థం చేసుకోగలనని, మన టీమ్ గెలవడం ముఖ్యమని ఎంతో హుందాగా మాట్లాడి, ప్రదర్శనతోనే కాదు తన మాటలతో కూడా అందరి మనసులు గెల్చుకున్నాడు. మరి షమీ ప్రదర్శనతో పాటు.. అతని కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.