iDreamPost
android-app
ios-app

రిటైర్మెంట్‌పై స్పందించిన షమీ! ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో ధోనిని అడిగానంటూ..

  • Published Jul 20, 2024 | 12:05 PM Updated Updated Jul 20, 2024 | 12:05 PM

Mohammed Shami, Retirement: భారత స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ తన రిటైర్మెంట్‌పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌, కోహ్లీ, జడేజా టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. మరి అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Mohammed Shami, Retirement: భారత స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ తన రిటైర్మెంట్‌పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌, కోహ్లీ, జడేజా టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. మరి అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 20, 2024 | 12:05 PMUpdated Jul 20, 2024 | 12:05 PM
రిటైర్మెంట్‌పై స్పందించిన షమీ! ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో ధోనిని అడిగానంటూ..

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ తాజాగా తన రిటైర్మెంట్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 తర్వాత గాయంతో జట్టు దూరమైన షమీ.. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని, పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించే పనిలో ఉన్నాడు. భరించలేని నొప్పితోనే వన్డే వరల్డ్‌ కప్‌ ఆడిన షమీ.. వరల్డ్‌ కప్‌ ముగిసిన తర్వాత తన గాయాలపై, ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్‌ పెట్టాడు. తాజాగా నెట్స్‌ బౌలింగ్‌ చేస్తూ కనిపించిన షమీ.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ తర్వాత టీమిండియా ఆడబోయే టెస్టు సిరీస్‌లతో షమీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే షమీ తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఇటీవల టీ20 ఫార్మాట్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి షమీ ఎప్పుడు రిటైర్‌ అవుతాడు అని జర్నలిస్ట్‌ నుంచి వచ్చిన ప్రశ్నకు బదులిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటం నాకు బోర్‌ కొట్టినప్పుడు.. గ్రౌండ్‌లో నిల్చుని ఇప్పుడు నేను చేయలేను అని నాకు కాన్ఫిడెన్స్‌ పోయినప్పుడు వెంటనే ఒక చిన్న పోస్ట్‌తో రిటైర్మెంట్‌ ప్రకటిస్తానంటూ వెల్లడించాడు. అయితే.. రిటైర్మెంట్‌ ఎప్పుడు ప్రకటించాలనే విషయంలో ఒకసారి ధోనిని కూడా అడిగినట్లే షమీ వెల్లడించాడు.

ధోనితో మాట్లాడుతూ.. రిటైర్మెంట్‌ ఎప్పుడు ప్రకటించాలని అడిగితే, ఆట నీకు బోర్‌ కొట్టినప్పుడు, లేదా నువ్వు ఎక్కువగా పరుగులు సమర్పించుకుంటూ బ్యాటర్ల చేతిలో కొట్టించుకుంటున్నప్పుడు రిటైర్మెంట్‌ ఇచ్చే అంటూ ధోని తనతో చెప్పినట్లు షమీ తెలిపాడు. అయితే.. ప్రస్తుతం తాను పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నానని, త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తానంటూ పేర్కొన్నాడు. ఇదే కాకుండా తన వ్యక్తిగత జీవితం, సానియా మీర్జాతో పెళ్లిపై వచ్చిన పుకార్లు, హార్ధిక్‌ పాండ్యాతో గొడవ ఇలా పలు ఆసక్తికర విషయాలపై షమీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మరి రిటైర్మెంట్‌పై షమీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş