iDreamPost
android-app
ios-app

సానియా మీర్జాతో పెళ్లి! తొలిసారి స్పందించిన టీమిండియా క్రికెటర్‌​ షమీ

  • Published Jul 20, 2024 | 10:35 AM Updated Updated Jul 20, 2024 | 10:35 AM

Mohammed Shami, Sania Mirza: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాతో తన పెళ్లి గురించి తొలిసారి స్పందించాడు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ షమీ. మరి షమీ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Mohammed Shami, Sania Mirza: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాతో తన పెళ్లి గురించి తొలిసారి స్పందించాడు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ షమీ. మరి షమీ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 20, 2024 | 10:35 AMUpdated Jul 20, 2024 | 10:35 AM
సానియా మీర్జాతో పెళ్లి! తొలిసారి స్పందించిన టీమిండియా క్రికెటర్‌​ షమీ

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత.. గాయంతో టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ ప్రస్తుతం రికవరీ పిరియడ్‌లో ఉన్నాడు. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్‌ సాధిస్తున్నాడు. అతను మంచి ఫిట్‌నెస్‌తో ఉండి ఉంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టీమ్‌లో భాగమయ్యేవాడు. కానీ, దురదృష్టవశాత్తు వన్డే వరల్డ్‌ కప్‌ సమయంలో గాయంతోనే ఆడిన షమీ.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రికవరీ అయ్యేందుకు లాంగ్‌ రెస్ట్‌ తీసుకున్నాడు. త్వరలో టీమిండియా ఆడబోయే టెస్టు సిరీస్‌లతో షమీ కమ్‌బ్యాక్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో షమీ.. ప్రముఖ జర్నలిస్ట్‌ శుభంకర్ మిశ్రాతో ఓ పొడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలపై మాట్లాడాడు షమీ. చాలా కాలంగా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్న వ్యక్తిగత విషయంపై కూడా స్పందించాడు షమీ. అదేంటంటే.. భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాతో పెళ్లి గురించి. షమీ తన భార్య హసిన్ జహాన్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. షమీపై ఆమె ఎన్నో ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత షమీ ఒంటరిగానే ఉంటున్నాడు. అలాగే కొంత కాలం క్రితం సానియా మీర్జా, పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సానియా కూడా ఒంటరిగానే ఉంటుంది. ఇంకేముంది.. నెటిజన్లు వీళ్లిద్దరికి లింక్‌ పెట్టి.. త్వరలోనే షమీ-సానియా పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు పెట్టించారు.

ఆ పుకార్లకు షమీ పుల్‌స్టాప్‌ పెట్టేశాడు. అలాంటిదేం లేదని.. అవన్నీ జస్ట్‌ రూమర్స్‌ అంటూ కొట్టిపారేశాడు. గుర్తింపు లేని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ నుంచి ఇలాంటి పోస్టు చేస్తుంటారని, దమ్ముంటే అసలైన అకౌంట్ నుంచి ఇలాంటి పోస్టులు చేస్తే అప్పుడు చూపిస్తా నేనుంటో అంటూ ఘాటుగానే బదులిచ్చాడు. తన జీవితం ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందని, ఎవరో ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి వెళ్లినంత మాత్రనా అంత సర్వనాశనం కాదని, తనతో తన కూతురి, తల్లి కుటుంబం అంతా ఉన్నారని షమీ పేర్కొన్నాడు. అలాగే సోషల్‌ మీడియాలో ఇలాంటి పుకార్లు పుట్టించే వాళ్లు.. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలని.. వ్యక్తిగత జీవితాల విషయానికి రావొద్దని, ఫన్‌, మీమ్‌ అంటే వేరే విషయాల్లో చేసుకోవచ్చని, ఇలా ఒకరి వ్యక్తిగత జీవితాన్ని ఇంకొకరితో ముడివేస్తూ బజారుకి లాగొద్దని సూచించాడు. షమీ ఇచ్చిన క్లారిటీతో సానియా-షమీ పెళ్లి చేసుకోవడం లేదనే విషయం స్పష్టమైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet