iDreamPost
android-app
ios-app

నిన్న ధావన్.. నేడు షమీ.. కన్న బిడ్డల కోసం కన్నీరు! ఇది నరకం!

  • Published Feb 08, 2024 | 1:56 PM Updated Updated Feb 09, 2024 | 5:22 PM

Mohammed Shami: మహ్మద్‌ షమీ తన భార్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షమీ తన బిడ్డను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వివరాలు..

Mohammed Shami: మహ్మద్‌ షమీ తన భార్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షమీ తన బిడ్డను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వివరాలు..

  • Published Feb 08, 2024 | 1:56 PMUpdated Feb 09, 2024 | 5:22 PM
నిన్న ధావన్.. నేడు షమీ.. కన్న బిడ్డల కోసం కన్నీరు! ఇది నరకం!

దేశాన్ని ఏలే రాజైనా.. తల్లికి బిడ్డే అన్నది ఎంత నిజమో.. తల్లిదండ్రులు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా.. సామాన్యుల మాదిరే వారికి కూడా బిడ్డలపై ప్రేమ, అనురాగాలు ఉంటాయి అన్నది వాస్తవం. సెలబ్రిటీలు మరీ ముఖ్యంగా సినిమా, రాజకీయ, క్రీడా రంగాల్లో ఉన్న వారి జీవితాలు ఉరుకులు పరుగులుగా సాగుతుంటాయి. తమ బిజీ జీవితంలో ఏమాత్రం విరామం దొరికిన కుటుంబంతో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. భార్యాబిడ్డలతో కలిసి.. విదేశాలకు వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేసి వస్తారు. అయితే కొందరి సెలబ్రిటీలు కెరీర్‌లో సక్సెస్‌ సాధించినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లు ఎదుర్కొంటుంటారు. ఇదుగో ఈ జాబితాలోకి వస్తాడు.. స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ. కెరీర్‌లో ఎన్నో అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తున్న ఈ టీమిండియా బౌలర్‌.. వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగడం లేదు.

ఇటీవల టీమిండియా క్రికెటర్‌ ధావన్‌.. తన భార్య తన కొడుకుని కలవనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా షమీ కూడా అలాంటి బాధనే వ్యక్తం చేశాడు. ప్రస్తుతం షమీ తన భార్య, బిడ్డకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కారణం.. ఈ స్టార్‌ బౌలర్‌, అతడి మాజీ భార్య హసీనా ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వీరు దూరంగానే ఉంటున్నారు. ఇదిలా ఉండగా షమీకి ఓ కుమార్తె ఉంది. అయితే తాజాగా షమీ తన కూతురిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. తన మాజీ భార్య.. తన బిడ్డను కలవనివ్వడం లేదని.. కుమార్తెను బాగా మిస్‌ అవుతున్నాను అన్నాడు. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. ‘‘నా మాజీ భార్యతో కనెక్ట్‌ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నా కుమార్తె ఐరాను కలిసి అవకాశం లభించడం లేదు’’ అని చెప్పుకొచ్చాడు

‘‘దీనంతటికి కారణం నా మాజీ భార్య హసనీనానే. తనే కావాలనే నా బిడ్డను నాకు చూపించడం లేదు. నేను ఐరాను బాగా మిస్‌ అవుతున్నాను’’ అంటూ షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. 2014లో షమీ, హసీనా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఐరా జన్మించింది. అయితే వివిధ కారణాలతో 2018లో షమీ, హసీనా విడిపోయారు. ఇదిలా ఉంటే షమీ జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పాత్రలో ఎవరు నటిస్తారనేది మాత్రం వెల్లడించలేదు.

బయోపిక్ గురించి అడిగిన ప్రశ్నకు షమీ బదులిస్తూ.. ‘‘అవును త్వరలోనే నా బయోపిక్ కూడా రాబోతోంది. దానిలో ఎవరు నటిస్తారు.. డైరెక్టర్‌ ఎవరు అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఒకవేళ నా బయోపిక్‌ తెరకెక్కించడానికి ఎవరూ ముందుకు రాకపోతే.. క్రికెట్‌ మానేసిన తర్వాత నేనే సొంతంగా బయోపిక్ తీస్తాను’’అని తెలిపాడు.

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అత్యుత్తమ బౌలర్‌గా నిరూపించుకున్నాడు మహ్మద్ షమీ. ప్రపంచ కప్‌లో షమీ మొదటి కొన్ని మ్యాచ్‌లలో ఆడలేదు.. కానీ తర్ర్వాత మ్యాచుల్లో చక్కటి బౌలింగ్‌తో భారత్‌ను ఒంటరిగా విజయతీరాలకు చేర్చాడు. ప్రపంచకప్‌లో 24 వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ భారత్ తరఫున 64 టెస్టు మ్యాచ్‌లు ఆడి 229 వికెట్లు పడగొట్టాడు. 101 వన్డేల్లో 195 వికెట్లు తీశాడు. 23 టీ20 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు తీశాడు. ప్రస్తుతం టీమ్ ఇండియాలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మహ్మద్ షమీ అందుబాటులో లేకపోవడం గమనార్హం. గాయం కారణంగా షమీ ఈ టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş