Somesekhar
మహ్మద్ షమీ మరో ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ అవార్డు అందుకున్న ఆరవ టీమిండియా ప్లేయర్ గా చరిత్రకెక్కుతాడు వరల్డ్ కప్ హీరో.
మహ్మద్ షమీ మరో ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ అవార్డు అందుకున్న ఆరవ టీమిండియా ప్లేయర్ గా చరిత్రకెక్కుతాడు వరల్డ్ కప్ హీరో.
Somesekhar
మహ్మద్ షమీ.. టీమిండియా పేస్ సెన్సేషన్. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అత్యద్భుత ప్రదర్శన కనబర్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ మెగాటోర్నీలో కేవలం 7 మ్యాచ్ ల్లోనే 24 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక షమీ భారతదేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారానికి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) షమీ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
మహ్మద్ షమీ.. భారతదేశ అత్యున్నత రెండో క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డుకు నామినేట్ అయినట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రత్యేక అభ్యర్థనలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ అవార్డు షమీ అందుకుంటే ఆరవ టీమిండియా క్రికెటర్ గా ఘనతకెక్కుతాడు. ఇంతకు ముందు అర్జున అవార్డు అందుకున్న వారిలో విరాట్ కోహ్లీ(2013), రోహిత్ శర్మ(2015), రవిచంద్రన్ అశ్విన్(2014), రవీంద్ర జడేజా(2019), శిఖర్ ధావన్(2021)లు ఉన్నారు.
కాగా.. 33 ఏళ్ల మహ్మద్ షమీ ఈ ఘనత సాధించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ కు సిద్దమవుతున్నాడు షమీ. తన సొంత పిచ్ ను రెడీ చేస్తున్న ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ లో కనబర్చిన సూపర్ ఫామ్ నే సఫారీ గడ్డపై కూడా చూపించాలని భావిస్తున్నాడు. పేస్ కు అనుకూలించే ప్రోటీస్ పిచ్ లపై షమీ అద్భుతాలు సృష్టిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మహ్మద్ షమీ అర్జున అవార్డుకు నామినేట్ అయ్యాడన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Mohammed Shami awarded by prestigious Arjuna Award. (PTI)
– Shami is an Inspiration…!!!! pic.twitter.com/nF9x71n8A0
— CricketMAN2 (@ImTanujSingh) December 13, 2023