iDreamPost
android-app
ios-app

షమీపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ భార్య!

  • Author Soma Sekhar Published - 07:44 AM, Sat - 18 November 23

మహ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్ మరోసారి అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. షమీ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్ మరోసారి అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. షమీ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Author Soma Sekhar Published - 07:44 AM, Sat - 18 November 23
షమీపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ భార్య!

మహ్మద్ షమీ.. ప్రస్తుతం ప్రపంచం మెుత్తం ఈ పేరు మారుమ్రోగిపోతోంది. వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న ఈ పేసర్ ను ఆపతరం ఏ బ్యాటర్ వల్లా కావడం లేదంటే అతిశయోక్తి కాదు. కంట్యిన్యూస్ గా వికెట్లు తీస్తూ.. టీమిండియా విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్న షమీ జీవితంలో ఎన్నో విషాద గాథలు దాగున్నాయని మనలో చాలా తక్కువ మందికే తెలుసు. అయితే షమీ మాజీ భార్య హసిన్ జహాన్ అతడి పై చేసిన గృహ హింస ఆరోపణలు, మ్యాచ్ ఫిక్సింగ్, కోర్టు అరెస్ట్ వారెంట్ లాంటి విషయాలు క్రికెట్ చూసే సగటు ప్రేక్షకులు తెలియనివి కావు. ఇదిలా ఉండగా.. సమయం వచ్చినప్పుడల్లా షమీపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది హసిన్ జహాన్. తాజాగా మరోసారి అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది.

వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అదరగొడుతున్న విషయం అందరికి తెలిసిందే. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. జట్టుకు తిరుగులేని విజయాలను అందిస్తున్నాడు. అయితే అతడి సూపర్ ఫామ్ చూసి పాపం అతడి మాజీ భార్య హసిన్ జహాన్ జీర్ణించుకోలేకపోతున్నట్లుంది. వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ దిగ్గజాలతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు షమీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా చూస్తున్న జహన్ కు కడుపుమంటగా ఉన్నట్లు ఆమె చేస్తున్న ఆరోపణలు చూస్తుంటేనే తెలుస్తుంది. ఇప్పటికే షమీపై ఎన్నో నిందలు మోపిన ఆమె.. తాజాగా మరోసారి తన వక్రబుద్దిని చూపిస్తూ కామెంట్స్ చేసింది.

“మహ్మద్ షమీ ఎంత మంచి ఆటగాడో.. అలాగే మంచి భర్తగా, తండ్రిగా ఉంటే.. మేమంతా కలిసి సంతోషంగా ఉండే వాళ్లం. దీంతో అతడికి ఇప్పుడు లభించే గౌరవం కంటే ఇంకాస్త ఎక్కువ వచ్చేది. కానీ అతడి దురాశ, డర్టీ మైండ్, మిస్టెక్స్ కారణంగా మేము ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నాం. అదీకాక షమీ నిజాల్ని డబ్బులతో దాచాలని ప్రయత్నిస్తున్నాడు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు కోర్టు ఎందుకు అతడికి శిక్ష విధించలేదు.. ఇప్పటికైనా మీ తప్పును మీరు తెలుకోండి అంటూ రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. మరి షమీపై అతడి మాజీ భార్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.