Hardik Pandya: కెప్టెన్సీ విషయంలో.. పాండ్యాకు అప్పుడు చాలా క్లియర్‌గా చెప్పా: షమీ

టీమిండియాలో షమీ, హార్ధిక్‌ పాండ్యా ఇద్దరూ స్టార్‌ అండ్‌ కీ ప్లేయర్లు. అలాగే 2022, 2023 ఐపీఎల్‌ సీజన్లలో ఒకే టీమ్‌కు ఆడారు. ఈ క్రమంలో ఒక విషయంలో పాండ్యాకు ఎంతో సున్నితంగా షమీ ఒక వార్నింగ్‌ ఇచ్చినట్లు వెల్లడించాడు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియాలో షమీ, హార్ధిక్‌ పాండ్యా ఇద్దరూ స్టార్‌ అండ్‌ కీ ప్లేయర్లు. అలాగే 2022, 2023 ఐపీఎల్‌ సీజన్లలో ఒకే టీమ్‌కు ఆడారు. ఈ క్రమంలో ఒక విషయంలో పాండ్యాకు ఎంతో సున్నితంగా షమీ ఒక వార్నింగ్‌ ఇచ్చినట్లు వెల్లడించాడు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుతంగా రాణించాడు. కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడినా.. 24 వికెట్లతో టోర్నీలోనే టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అయితే.. వరల్డ్‌ కప్‌ తర్వాత రెస్ట్‌ తీసుకుంటున్న షమీ.. ఇంకా తిరిగి గ్రౌండ్‌లోకి దిగలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో ఆడతాడని భావించినా.. గాయం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలుస్తోంది. అయితే.. వరల్డ్‌ కప్‌ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌ను వీడి ముంబైకి రావడమే కాకుండా రోహిత్‌ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ కెప్టెన్సీ పగ్గాలు అందుకోవడంతో ఒక్కసారిగా పాండ్యా టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారిపోయాడు.

ఈ క్రమంలోనే పాండ్యా గురించి కొన్ని రోజుల క్రితం షమీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ మారాయి. ఐపీఎల్‌ 2022-23లో గుజరాత్‌ టైటాన్స్‌కు హార్ధిక్‌ పాండ్యా కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అలాగే గుజరాత్‌ టీమ్‌కు షమీ కూడా ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటికీ అదే టీమ్‌లో ఉన్నాడు. అయితే.. ఐపీఎల్‌ 2023 సీజన్‌ సందర్భంగా ఒక మ్యాచ్‌లో షమీ క్లిష్టమైన క్యాచ్‌ డ్రాప్‌ చేసినందుకు పాండ్యా.. షమీపై నోరు పారేసుకుని, సహనం కోల్పోయి బూతులతో విరుచుకుపడ్డాడు. ఒక సీనియర్‌ ప్లేయర్‌ అయిన షమీపై అలా వ్యవహరించడంపై పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, షమీ మాత్రం పాండ్యా నోరుపారేసుకున్నా.. ఒక్క మాట కూడా తిరిగి అనకుండా తన హుందాతనాన్ని చాటుకున్నాడు.

అయితే.. ఈ విషయంలో షమీ అప్పుడే హార్ధిక్ పాండ్యాతో మాట్లాడినట్టు చెప్పాడు. మ్యాచ్‌ తర్వాత పాండ్యాతో షమీ మాట్లాడుతూ.. ‘చూడు తమ్ముడు.. నువ్వు కెప్టెన్‌వి, ఆ బాధ్యత ఉంటుంది నేను అర్థం చేసుకోగలను. కానీ, ఇలాంటి బ్యాడ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ గ్రౌండ్‌లో మాత్రం వద్దు’ అని చాలా సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత మళ్లీ పాండ్యా ఎప్పుడూ కూడా షమీతో ఆ విధంగా ప్రవర్తించలేదని కూడా షమీ వెల్లడించాడు. అప్పటి కప్పుడు కోపం చూపించకుండా ఎంతో హుందాగా ‍వ్యవహరించిన షమీ.. పాండ్యాకు అర్థమయ్యేలా సున్నితంగా నచ్చచెప్పి మళ్లీ మార్కులు కొట్టేశాడు. ఒక కెప్టెన్‌గా పాండ్యాపై ఉండే ఒత్తిడి అర్థం చేసుకోవడమే కాకుండా.. తనతో అలా ప్రవర్తించకూడదని కూడా షమీ పాండ్యాకు వివరించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments