iDreamPost
android-app
ios-app

ఆ విషయానికి వస్తే ప్రపంచంలో రోహితే బెస్ట్‌: పాక్‌ క్రికెటర్‌

  • Published Feb 22, 2024 | 4:52 PM Updated Updated Feb 22, 2024 | 8:57 PM

Mohammad Amir, Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఉన్నాడు. అతని వద్ద బోలెడు షాట్లు ఉన్నాయి. కాని ఒక విషయంలో మాత్రం రోహిత్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ అని ఓ పాక్‌ క్రికెటర్‌ కితాబిస్తున్నాడో. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Mohammad Amir, Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఉన్నాడు. అతని వద్ద బోలెడు షాట్లు ఉన్నాయి. కాని ఒక విషయంలో మాత్రం రోహిత్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ అని ఓ పాక్‌ క్రికెటర్‌ కితాబిస్తున్నాడో. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Feb 22, 2024 | 4:52 PMUpdated Feb 22, 2024 | 8:57 PM
ఆ విషయానికి వస్తే ప్రపంచంలో రోహితే బెస్ట్‌: పాక్‌ క్రికెటర్‌

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫోకస్‌ అంతా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌పైనే ఉంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైనప్పటికీ.. వేగంగా పుంజుకుని తర్వాత రెండు టెస్టుల్లో వరుస విజయాలు సాధించింది. ఈ విజయాల్లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు చాలా క్రెడిట్‌ ఇవ్వాలి. ముఖ్యంగా మూడో టెస్టులో కెప్టెన్‌గానే కాక, ఒక ఆటగాడిగా రోహిత్‌ శర్మ అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన గడ్డు పరిస్థితుల్లో జడేజాతో కలిసి అద్భుతం భాగస్వామ్యం నెలకొల్పడమే కాక.. సెంచరీతో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ ఆమీర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

రోహిత్‌ శర్మ గురించి మాట్లాడిన ఆమీర్‌.. పుల్‌ షాట్స్‌ ఆడటంలో రోహిత్‌ శర్మ ప్రపంచంలోనే బెస్ట్‌ అని పేర్కొన్నాడు. రోహిత్‌ కంటే బాగా మరెవరు పుల్‌షాట్‌ ఆడలేరని ఆమీర్‌ తేల్చేశాడు. నిజానికి పుల్‌షాట్‌ అనేది రోహిత్‌ ట్రేడ్‌మార్క్‌ షాట్‌. ఎంతో ఈజీగా షార్ట్స్‌ బాల్స్‌ను పుల్‌షాట్‌తో సిక్స్‌కు తరలిస్తూ ఉంటాడు. బాల్‌ ఎంత వేగంగా వచ్చినా.. మెరుపు వేగంతో స్పందించే రోహిత్‌.. ఎంతో అద్భుతంగా పుల్‌షాట్‌ ఆడుతుంటాడు. రోహిత్‌ శర్మ పుల్‌ షాట్‌ ఆడితే.. చూసేందుకు రెండు కళ్లు చాలవంటూ క్రికెట్‌ అభిమానులు అంటుంటారు. అయితే.. కొన్ని సార్లు అదే పుల్‌ షాట్‌ వల్ల కూడా రోహిత్‌ అవుట్‌ అవుతుంటాడు.

రోహిత్‌ శర్మతో పాటు మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్‌, కెవిన్‌ పీటర్సన్‌ కూడా పుల్‌ షాట్‌ను బాగా ఆడేవారు. అలాంటి దిగ్గజాలను కూడా కాదని ఆమీర్‌ రోహిత్‌ శర్మను పుల్‌ షాట్‌ ఆడే అత్యుత్తమ క్రికెటర్‌గా పేర్కొనడంపై క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రోహిత్‌ శర్మ.. మూడో టెస్టులో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. శుక్రవారం నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. మరి ఆ మ్యాచ్‌లో కూడా రోహిత్‌ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. మరి రోహిత్‌ శర్మ పుల్‌ షాట్‌ ప్రపంచంలోనే బెస్ట్ అని ఒక పాకిస్థాన్‌ క్రికెటర్‌ కితాబివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş