iDreamPost
android-app
ios-app

డచ్ బౌలర్ కు చుక్కలు చూపిన సాంట్నర్! ఒక్క బాల్ కు 13 రన్స్..

  • Author Soma Sekhar Updated - 10:08 AM, Tue - 10 October 23
  • Author Soma Sekhar Updated - 10:08 AM, Tue - 10 October 23
డచ్ బౌలర్ కు చుక్కలు చూపిన సాంట్నర్! ఒక్క బాల్ కు 13 రన్స్..

వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తన జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి.. ప్రత్యర్థి జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను మట్టికరిపించిన కివీస్.. తన రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో కివీస్ అన్ని విభాగాల్లో రాణించి 99 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివరి బంతికి ఏకంగా 13 పరుగులు పిండుకుంది. బాస్ లీ డే వేసిన ఈ ఓవర్లో సాంట్నర్ సిక్సులతో విరుచుకుపడ్డాడు. అతడు కేవలం 17 బంతుల్లోనే 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. డచ్ బౌలర్ చేసిన తప్పిదం మూలంగా ఒకే ఒక్క బంతికి ఏకంగా 13 పిండుకున్నాడు కివీస్ బ్యాటర్ సాంట్నర్. నెదర్లాండ్స్ బౌలర్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేయడానికి వచ్చాయి. బ్యాటింగ్ ఎండ్ లో సాంట్నర్ ఉండగా.. చివరి బాల్ ను బాస్ లీ డే నోబ్ వేయగా.. ఆ బంతిని సాంట్నర్ సిక్స్ బాదాడు. దీంతో ఫ్రీ హిట్ తో పాటు 7 పరుగులు లభించాయి. తర్వాత బంతిని కూడా సాంట్నర్ సిక్స్ కొట్టడంతో.. ఒకే ఒక్క బంతికి ఏకంగా 13 పరుగులు వచ్చినట్లు అయ్యింది. ప్రస్తుతం ఈ రెండు సిక్స్ లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో బ్యాట్ తో పాటు బంతితో కూడా చెలరేగాడు స్టార్ ఆల్ రౌండర్. బ్యాటింగ్ లో కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 రన్స్ తో అజేయంగా నిలవగా.. బౌలింగ్ లో 5 వికెట్లతో నెదర్లాండ్స్ నడ్డివిరిచాడు. ఇక రెండు వరస విజయాలతో గ్రూప్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది కివీస్.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetkom girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis