Mitchell Marsh: వీడియో: అవార్డ్‌ అందుకుంటూ ఏడ్చేసిన స్టార్‌ క్రికెటర్‌!

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ మిచెల్‌ మార్ష్‌ అనగానే.. చాలా మంది వరల్డ్‌ కప్‌పై కాళ్లు పెట్టి క్రికెట్‌ అంటూ గుర్తుపడతారు. అలాంటి ఆటగాడు తాజాగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ మిచెల్‌ మార్ష్‌ అనగానే.. చాలా మంది వరల్డ్‌ కప్‌పై కాళ్లు పెట్టి క్రికెట్‌ అంటూ గుర్తుపడతారు. అలాంటి ఆటగాడు తాజాగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించి.. ఆసీస్‌ ఏకంగా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే.. కప్పు గెలిచిన తర్వాత ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌ మిచెల్‌ మార్ష్‌ ఆ కప్పుపై కాళ్లు పెట్టి దిగిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో క్రికెట్‌ అభిమానులు మార్ష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత మార్ష్‌ ఆ విషయంపై క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే.. ఇప్పుడు మరోసారి మార్ష్‌ వార్తల్లో నిలిచాడు.

తాజాగా మార్ష్‌కు అలెన్‌ బోర్డర్‌ అవార్డు వరించింది. ఈ మెడల్‌ అందుకుంటున్న క్రమంలో మార్ష్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన జీవితంలో చాలా కఠిన పరిస్థితులు చూశానని, చాలా మంది తనకు మద్దుతుగా నిలిచారని వెల్లడించాడు. ఈ సమ​యంలో మార్ష్‌ స్టేజ్‌పైన మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా మార్ష్‌ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కప్పుపై కాళ్లు పెట్టి కఠిన వ్యక్తిలా కనిపించిన మార్ష్‌.. ఇంత సున్నితంగా కూడా ఉంటాడా అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఇక వరల్డ్‌ కప్‌లో మార్ష్‌ మంచి ప్రదర్శననే కనబర్చాడు. ఇక ఇప్పటి వరకు తన కెరీర్‌లో 40 టెస్టులు, 89 వన్డేలు, 49 టీ20 మ్యాచ్‌లు ఆడిన మార్ష్‌.. టెస్టుల్లో 1890, వన్డేల్లో 2672, టీ20ల్లో 1272 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మార్ష్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. టెస్టుల్లో 47, వన్డేల్లో 56, టీ20ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్‌లో తన మార్క్‌ చూపిస్తున్న మార్ష్‌.. ఇలా భావోద్వేగానికి గురి కావడం చర్చనీయాంశంగా మారింది. మరి మార్ష్‌ కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments