SNP
SNP
విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం టీమిండియాలో నంబర్ వన్ ఆటగాడు. ఈ స్టార్ ప్లేయర్ ఇండియన్ క్రికెట్‌లో సచిన్ తర్వాత సచిన్ అంతటోడు. తాజాగా కోహ్లీ 15 ఏళ్ల కెరీర్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఇంత లాంగ్ కెరీర్‌ను కొనసాగించేందుకు, రాణించడానికి ప్రేరణ ఏమైఉంటుందని.. అతనికి ఎదురైన ప్రశ్నకు కోహ్లీ ఈ విధంగా జవాబు చెప్పాడు. “ఒక క్రికెటర్‌గా, మిలియన్ల మంది అభిమానులు మీ వెనుక నిలబడి, మీ విజయానికి ఉత్సాహం చూపిస్తున్నారని తెలుసుకోవడం కంటే ప్రేరణ మరొకటి ఉండదు” అని కోహ్లీ అన్నాడు.
కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అతని ఆటకు, అతని యాటిట్యూడ్‌ను అభిమానించే వారి సంఖ్య లెక్కపెట్టలేం. కోహ్లీ ఒక్కడికే అని కాదు.. క్రికెట్‌ను ఓ మతంలా భావించే మన దేశంలో క్రికెటర్లందరినీ డెమీ గాడ్స్‌లా భావిస్తుంటారు. దేశం తరఫున ఆడుతూ.. అంతర్జాతీయ వేదికపై దేశప్రతిష్టను పెంచుతున్న ప్రతి క్రికెటర్ వెనుక కొన్ని కోట్ల మంది మద్దతు ఉంటుంది. అందుకే కోహ్లీ కూడా ఆ మాటను అంత బలంగా చెప్పాడు. తాము అంత బాగా ఆడేందుకు కొన్ని కోట్ల మంది తమకు మద్దుతుగా నిలుస్తుంటారని, వాళ్లే తమ బలం అని అన్నాడు.
అలాగే మనం ఏ పని చేస్తున్నా, మనస్ఫూర్తిగా చేయాలని, తప్పుడు ఉద్దేశ్యంతో చేస్తే, ఆ పని ఎప్పటికీ విజయవంతం కాదని, మనం చేసే పనిలో మీరు పూర్తిగా నిమగ్నమైతే ఫలితం తప్పకుండా అద్భుతంగా ఉంటుంది, దేవుడు కూడా సహాయం చేస్తాడని అన్నాడు. తాజాగా ఆసియా కప్ సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధం అవుతుంది. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ మొదలుకానుంది. ప్రస్తుతం కోహ్లీతో పాటు ఆటగాళ్ల దృష్టి మొత్తం వన్డే వరల్డ్ కప్‌పైనే ఉంది. మరి తనకు ప్రేరణగా నిలిచేది అభిమానుల మద్దతు, ప్రేమే అని కోహ్లీ పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli said “As a Cricketer, there is nothing more motivating than knowing millions of fans are standing behind you & cheering for your success”. [Star Sports] pic.twitter.com/2MBZ0q0BhW
— Johns. (@CricCrazyJohns) September 18, 2023
Virat Kohli said “Whatever work you are doing, do it with your heart. If you do it with wrong intentions then that work will never be successful – If you are fully involved in the work you are doing then the result will be very good & God will also help you”. [Star Sports] pic.twitter.com/Rz0DrjnvvF
— Johns. (@CricCrazyJohns) September 19, 2023
ఇదీ చదవండి: VIDEO: బాల్ చూడకుండా భారీ సిక్స్! గుడ్డి ఊపుడంటున్న ఫ్యాన్స్