ఆ పాట వింటే పాకిస్థాన్‌ చెలరేగిపోతుంది! స్టేడియంలో పెట్టొద్దన్న రోహిత్‌ శర్మ

ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ముగిసి వారం రోజులు గడుస్తున్నా.. ఇంకా ఆ మ్యాచ్‌ గురించే చర్చ. తాజాగా ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. టీమిండియా విజయం వెనుక అసలు కారణం వేరే ఉందంటూ.. మాజీ క్రికెటర్‌ బాంబు పేల్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ముగిసి వారం రోజులు గడుస్తున్నా.. ఇంకా ఆ మ్యాచ్‌ గురించే చర్చ. తాజాగా ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. టీమిండియా విజయం వెనుక అసలు కారణం వేరే ఉందంటూ.. మాజీ క్రికెటర్‌ బాంబు పేల్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వరల్డ్‌ కప్‌లో క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మ్యాచ్‌ ఏందంటే.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌. ఆ మ్యాచ్‌ జరిగి దాదాపు వారం రోజులు గడుస్తున్నా.. ఆ మ్యాచ్‌ గురించి చర్చ ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. భారత్‌-పాక్‌ మ్యాచ్ అంటే ఎంతో టఫ్‌ ఫైట్‌ ఉంటుందని అంతా భావించారు.. కానీ, పాకిస్థాన్‌ జట్టు ఫేలవ ప్రదర్శన, టీమిండియా డామినేషన్‌తో మ్యాచ్‌ వన్‌ సైడ్‌గా సాగింది. అయితే.. ఈ మ్యాచ్‌ గురించి ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న మైఖేల్‌ వాగ్‌ సంచలన కామెంట్స్‌ చేశాడు. టీమిండియా విజయం వెనుక రోహిత్‌ చేసిన ఆ పని కారణంగా ఉందంటూ బాంబు పేల్చాడు.

ఇండియా-పాకిస్థాన్‌ మధ్య ఈ నెల 14న అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఏకంగా లక్షకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఆ స్టేడియంలో పాటలు ప్లే చేసే డీజేకు రోహిత్‌ శర్మ ఓ వార్నింగ్‌ ఇచ్చినట్లు మైఖేల్‌ తెలిపాడు. అదేంటంటే.. ‘దిల్‌ దిల్‌ పాకిస్థాన్‌’ అనే పాటను మ్యాచ్‌ సమయంలో అస్సలు ప్లే చేయవద్దని.. ఆ పాట వింటే పాకిస్థాన్‌ ఆటగాళ్లు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ.. అద్భుతంగా ఆడతారని, ఆ వింటే వారిలో గొప్ప స్ఫూర్తి కలుగుతుందని.. ఆ సమయంలో వారిని ఓడించడం సాధ్యం కాదని రోహిత్‌ డీజేతో చెప్పినట్లు.. అందుకే పాకిస్థాన్‌పై ఇండియా గెలిచిందని అన్నాడు.

అయితే.. ఈ వ్యాఖ్యలు సరదాగా చేసినవే. పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ను సపోర్ట్‌ చేసే కొంతమంది ఫ్యాన్స్‌ వింత వాదనకు మైఖేల్‌ ఈ కౌంటర్‌ ఇచ్చాడు. ఇండియాలో పాక్‌ టీమ్‌కు సరైన సపోర్ట్‌ లేదని, కనీసం దిల్‌ దిల్‌ పాకిస్థాన్‌ అనే సాంగ్‌ కూడా ప్లే చేయడం లేదని పేర్కొన్నారు. దీంతో.. ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌పై ఓటమి తర్వాత మైఖేల్‌ ఈ వ్యాఖ్యలు సరదాగా చేశాడు. మైదానంలో దిగిన తర్వాత.. అద్భుత ఆటతీరుతో మ్యాచ్‌లు గెలవాలి కానీ, ఇలా పాటలపై ఆధారపడితే ఎలా అంటూ మరికొంతమంది క్రికెట్‌ అభిమానులు కూడా పాక్‌ ఫ్యాన్స్‌కు సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: MS ధోనీకి అరుదైన గౌరవం.. ఇది అస్సలు ఎక్స్​పెక్ట్ చేసి ఉండరు!

Show comments