షార్ట్‌, బ్రూక్‌ విధ్వంసం! 63 బంతుల్లోనే 136 పరుగులు..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌లో స్టార్‌ ప్టేయర్‌గా ఉన్న హ్యారీ బ్రూక్‌ ఆడితే ఎలా ఉంటుందో మరోసారి తెలిసొచ్చింది. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో బ్రూక్‌ కాస్త నిరాశపర్చినా.. సెంచరీతో చెలరేగాడు. తనకు పెట్టిన ధర, తనపై పెట్టుకున్న అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయిన బ్రూక్‌.. తాజాగా ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్‌లో మాత్రం తన హండ్రెడ్‌ పర్సంట్‌ ఇస్తున్నాడు.
నసదరన్ బ్రేవ్-నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. మ్యాథ్యూ షార్ట్‌తో కలిసి బ్రూక్‌ సదరన్‌ బ్రేక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీళ్లిద్దరూ కలిసి కేవలం 63 బంతుల్లోనే 133 పరుగులు చేసి దుమ్మురేపారు.

తొలుత టామ్‌ బాంటన్‌ 34 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్స్‌తో 44 పరుగులు చేయగా.. ఆ తర్వాత షార్ట్‌, బ్రూక్‌ జోడీ విధ్వంసం మొదలైంది. ముఖ్యంగా బ్రూక్‌.. సదరన్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సులతో 63 పరుగులతో విలయతాండవం చేశాడు. అలాగే షార్ట్‌ సైతం 36 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 73 పరుగులు చేసి దుమ్మురేపాడు. బ్రూక్‌-షార్ట్‌ జోడీ చెలరేగుతుంటే.. సదరన్‌ బ్రేవ్‌ బౌలర్లు చేతులెత్తేశారు. వాళ్లను అవుట్‌ చేయడం అటుంచి.. కనీసం వాళ్లకు ఫోర్లు, సిక్సులు సమర్పించకుంటే చాలన్నట్లు వాళ్ల బౌలింగ్‌ సాగింది. కానీ, చివర్లో షార్ట్‌ అవుటైనా.. బ్రూక్‌ విధ్వంసం కొనసాగింది. 27 బంతుల్లో 63 పరుగులతో హ్యారీ బ్రూక్‌ నాటౌట్‌గా నిలిచాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్తర్న్‌ సూపర్‌ ఛార్జర్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. టామ్‌(44), షార్ట్‌(73), బ్రూక్‌(63 నాటౌట్‌) చెలరేగడంతో నార్తర్న్‌.. సదరన్‌ బ్రేవ్‌ ముందు టఫ్‌ టార్గెట్‌ను ఉంచింది. సదరన్‌ బౌలర్లలో రెహాన్‌ అహ్మద్‌, మిల్స్‌ మాత్రమే చెరే వికెట్‌ తీసుకున్నారు. ఇక భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సదరన్‌ బ్రేవ్‌ టీమ్‌ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి కేవలం 141 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. కెప్టెన్‌ జేమ్స్‌ 33, టిమ్‌ డేవిడ్‌ 40 పరుగులతో రాణించినా.. విజయానికి అవి సరిపోలేదు. టిమ్‌ డేవిడ్‌ 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో ఉన్నంత సేపు గడగడలాడించాడు. కానీ.. అతన్ని టోప్లీ అవుట్‌ చేయడంతో నార్తర్న్‌ టీమ్‌ ఊపిరి పీల్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: హాఫ్‌ సెంచరీ తర్వాత తిలక్‌ కూల్‌ సెలబ్రేషన్స్‌! ఎవరి కోసమో తెలుసా?

Show comments