iDreamPost
android-app
ios-app

స్నేహితుడిపై కనికరం చూపని స్టోయినీస్‌! పిచ్చికొట్టుడు కొట్టాడు..

  • Published Jul 19, 2023 | 12:34 PM Updated Updated Jul 19, 2023 | 12:34 PM
  • Published Jul 19, 2023 | 12:34 PMUpdated Jul 19, 2023 | 12:34 PM
స్నేహితుడిపై కనికరం చూపని స్టోయినీస్‌! పిచ్చికొట్టుడు కొట్టాడు..

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినీస్‌, స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా చాలా మంచి స్నేహితులు. వీరిద్దరూ ఎంత బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటే వాళ్ల క్లోజ్‌నెస్‌ చూస్తే.. కొంచెం అతిగా కూడా అనిపిస్తుంటుంది. ముద్దులు పెట్టుకోవడం, చేతులు ఎక్కడెక్కడో పెట్టుకుంటూ సోషల్‌ మీడియాలో అనేకసార్లు వైరల్‌గా మారారు. వీరి ఫ్రెండ్షిప్‌ గురించి పక్కనపెడితే.. ఇంతకాలం వీరిద్దరూ ఒకే టీమ్‌లో ఆడుతూ.. స్నేహం కొనసాగించారు. స్టోయినీస్‌ సిక్స్‌ కొడితే జంపా, జంపా వికెట్‌ తీస్తే స్టోయినీస్‌ సంతోషంతో చప్పట్లు కొట్టుకునేవారు.

అయితే.. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో మాత్రం ఇద్దరు వేర్వేరు టీమ్‌లకు ఆడుతూ ప్రత్యర్థుల్లా బరిలోకి దిగుతున్నారు. ఇలా ఇద్దరూ వేర్వేరు టీమ్‌లకు ఆడిన లీగులు ఉన్నా.. ఇలాంటి సీన్‌ మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. ఈ లీగ్‌లో స్టోయినీస్‌ శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్‌స్‌ టీమ్‌ తరఫున ఆడుతుండగా.. ఆడమ్‌ జంపా లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మంగళవారం రాత్రి ఈ రెండు టీమ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆడమ్‌ జంపా బౌలింగ్‌ను స్టోయినీస్‌ చీల్చిచెండాడు. జంపా వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో స్టోయినీస్‌ ఏకంగా మూడు సిక్సులు, ఒక ఫోర్‌తో విరుచుకుపడ్డాడు. స్టోయినీస్‌ విధ్వంసానికి ఆ ఓవర్లో ఏకంగా 24 పరుగులు వచ్చాయి. అయితే.. ప్రాణస్నేహితుడని కూడా చూడకుండా, స్టోయినీస్‌.. జంపాను చితక్కొట్టడంపై క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే’ అన్న రీతిలో ఫ్రెండ్‌షిప్‌ ఫ్రెండ్‌షిప్పే.. బాదుడు బాదుడే అన్నట్లు స్టోయినీస్‌.. జంపాపై కొంచెం కూడా కనికరం చూపలేదు. స్టోయినీస్‌కు భారీగా పరుగులు సమర్పించుకున్నా.. జంపా సైతం మూడు వికెట్ల తీసి రాణించాడు. స్టోయినీస్‌ 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో స్టోయినీస్‌ టీమ్‌ 21 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది.

ఇదీ చదవండి: కొడితే.. స్టేడియం బయట కార్‌ పార్కింగ్‌లో పడ్డ బాల్‌! బిత్తరపోయిన పాక్‌ బౌలర్‌

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş