దులీప్‌ ట్రోఫీలో 7 వికెట్లతో సత్తా చాటిన మానవ్ సుతార్! టీమిండియాలోకి ఎంట్రీ?

Manav Suthar, Duleep Trophy 2024: టీమిండియా స్టార్లు ఆడుతున్న దులీప్‌ ట్రోఫీలో యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నాడు. తాజాగా ఓ కుర్ర స్పిన్నర్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్‌ గురించి మరిన్ని విశేషాలు ఇలా ఉన్నాయి..

Manav Suthar, Duleep Trophy 2024: టీమిండియా స్టార్లు ఆడుతున్న దులీప్‌ ట్రోఫీలో యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నాడు. తాజాగా ఓ కుర్ర స్పిన్నర్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్‌ గురించి మరిన్ని విశేషాలు ఇలా ఉన్నాయి..

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దులీప్‌ ట్రోఫీలో రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లు విఫలం అవుతున్నా.. ఇండియన్‌ క్రికెట్‌కు ఫ్యూచర్‌ వంటి కొత్త స్టార్లు పుట్టుకొస్తున్నారు. మానవ్‌ సుతార్‌ కూడా అదే కోవకు చెందిన వాడిలా కనిపిస్తున్నాడు. టీమిండియాకు ఆడిన చాలా మంది స్టార్‌ ఆటగాళ్లు ఆడుతున్న దులీప్‌ ట్రోఫీలో ఇండియా-సీ తరఫున ఆడుతున్నాడు మానవ్‌. అనంతపురంలోని రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ స్టేడియంలో ఇండియా-సీ, ఇండియా-డీ మధ్య జరిగిన మ్యాచ్‌లో మావన్‌ తన స్పిన్‌ మ్యాజిక్‌తో చెలరేగిపోయాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లతో సత్తా చాటాడు.

అది కూడా శ్రేయస్‌ అయ్యర్‌, దేవదత్త్‌ పడిక్కల్‌, కేఎల్‌ భరత్‌, అక్షర్‌ పటేల్‌ లాంటి టీమిండియాకు ఆడిన ప్లేయర్లతో కూడిన టీమ్‌పై ఈ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మొత్తంగా 19.1 ఓవర్లు బౌలింగ్‌ చేసిన మానవ్‌ 49 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అయిన మానవ్‌ సుతార్‌.. ఈ ప్రదర్శనతో టీమిండియాకు ఆడాలనే తన కలను నిజం చేసుకునేందుకు మరో అడుగు ముందుకు పడిందనే చెప్పాలి. టీమిండియాలో కుల్దీప్‌ యాదవ్‌ రూపంలో ఇప్పటికే మ్యాచ్‌ విన్నింగ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ ఉన్నాడు. అయితే.. మానవ్‌ వయసు ఇప్పుడు కేవలం 22 ఏళ్లు మాత్రమే.. ఇలాంటి ప్రదర్శనతు దేశవాళి క్రికెట్‌లో కొనసాగిస్తే.. చూస్తూ ఉండగానే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్‌ 2024లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఒక మ్యాచ్‌ ఆడిన మానవ్‌ అంతగా ఆకట్టుకోలదు. 2 ఓవర్లు బౌలింగ్‌ వేసి 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా డీ టీమ్‌ 164 పరుగులకు ఆలౌట్‌ అయింది. అక్షర్‌ పటేల్‌ ఒక్కడే 86 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో మానవ్‌ సుతార్‌కు ఒక్క వికెట్‌ మాత్రమే దక్కింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-సీ టీమ్‌ 168 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇంద్రజిత్‌ 72 పరుగులతో రాణించాడు. డీ టీమ్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా 4 వికెట్లతో సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇండియా-డీ జట్టు 236 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఈ సారి కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 54, పడిక్కల్‌ 56 పరుగులతో రాణించారు. సీ టీమ్‌ బౌలర్‌ మానవ్‌ సుతార్‌ ఏకంగా 7 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. మూడో రోజు రెండో సెషన్‌ సమయానికి ఇండియా సీ జట్టు 2 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విజయానికి మరో 78 పరుగులు కావాలి.. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరి ఈ మ్యాచ్‌లో మానవ్‌ సుతార్‌ బౌలింగ్‌ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments