SNP
MS Dhoni, Sakshi: టీమిండియా మాజీ క్రికెటర్ ధోని.. రిచెస్ట్ క్రికెటర్లలో ఒకడు. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భాన్ని ఎంతో సింపుల్‌గా చేసుకున్నాడు. మరి ఆ సందర్భం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
MS Dhoni, Sakshi: టీమిండియా మాజీ క్రికెటర్ ధోని.. రిచెస్ట్ క్రికెటర్లలో ఒకడు. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భాన్ని ఎంతో సింపుల్‌గా చేసుకున్నాడు. మరి ఆ సందర్భం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా ధోని ఏం చేసినా వైరల్ అవుతుంది. అతను కొత్త హెయిర్ స్టైల్ చేయించుకున్నా.. అది ఒక స్పెషల్ న్యూస్. ధోని రేంజ్. టీమిండియాకు ఎప్పుడో వీడ్కోలు పలికినా.. ప్రస్తుతం టీమ్‌లో టాప్ ప్లేయర్లుగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్టార్‌డమ్‌కు ధోని గట్టి పోటీ ఇస్తూ ఉంటాడు. ఏడాదికి ఒకసారి ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నా.. ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అసలు ధోని అంటే ఎందుకు ఇంత అభిమానం చూపిస్తారు? అతనంటే ఎందుకు క్రికెట్ అభిమానులు పడిచస్తారో చాలా మందికి అర్థం కాదు.
ధోనిని ఇష్టపడేందుకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో సింప్లిసిటీ కూడా ఒక ప్రధాన కారణం అంటున్నారు అతని అభిమానులు. అందుకు ఇదే బెస్ట్ ఎంగ్జామ్‌పుల్ అంటున్నారు. తాజాగా ధోని తన ఈ రోజు(జూలై 4) 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాడు. తన భార్య సాక్షితో కలిసి ఎంతో సింపుల్‌గా ఇంట్లోని ఒక టేబుల్‌పై, చిన్న కేక్‌ను కట్ చేసి.. తన భార్యకు తినిపించి, తన భార్య తినిపిస్తే తాను తిని.. తన 15వ మ్యారేజ్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన ధోని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్, దేశానికి ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా.. వ్యాపారాలు, వ్యాపార ప్రకటనలు, అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ రెండు చేతులా కొన్ని వందల కోట్లు సంపాదించిన, సంపాదిస్తూ ధోని.. మరీ ఇంత సింపుల్‌గా తన మ్యారేజ్ డేను జరుపుకోవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరీ ఇంత సింపుల్‌సిటీ ఏంటి స్వామీ అంటూ అతని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇదనే కాదు.. తన స్వస్థలం రాంచీలో బైక్‌పై ఎంతో సాధారణంగా బయటికి వెళ్లి వస్తూ ఉంటాడు ధోని. చాలా విషయాల్లో సింపుల్‌గా ఉంటూ ధోని అంటే డిఫరెంట్ అని నిరూపిస్తూ ఉంటాడు. మరి తన మ్యారేజ్ డేను ధోని ఇంత సింపుల్‌గా చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni & Sakshi celebrating their 15th wedding anniversary ❤️ pic.twitter.com/Et5JuBx0Jt
— Johns. (@CricCrazyJohns) July 4, 2024