లక్నోకు కొత్త కెప్టెన్‌.. KL రాహుల్‌పై వేటు! మాజీ క్రికెటర్‌ సంచలన స్టేట్‌మెంట్‌

LSG, IPL 2025, KL Rahul, Amit Mishra: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ ప్లేస్‌లో కొత్త కెప్టెన​ వస్తాడంటూ అమిత్‌ మిశ్రా తెలిపాడు. అతను ఇచ్చిన ఈ సంచలన స్టేట్‌మెంట్‌తో క్రికెట్‌ వర్గాల్లో ఆ కొత్త కెప్టెన్‌ ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

LSG, IPL 2025, KL Rahul, Amit Mishra: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ ప్లేస్‌లో కొత్త కెప్టెన​ వస్తాడంటూ అమిత్‌ మిశ్రా తెలిపాడు. అతను ఇచ్చిన ఈ సంచలన స్టేట్‌మెంట్‌తో క్రికెట్‌ వర్గాల్లో ఆ కొత్త కెప్టెన్‌ ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ గురించి ఓ షాకింగ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్‌ అమిత్‌ మిశ్రా. వచ్చే ఐపీఎల్‌ 2025 సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను తప్పించి.. అతని స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందంటూ మిశ్రా వెల్లడించాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌ నుంచి లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌.. లక్నో సూపర్‌ జెయింట్స్‌లోకి వచ్చాడు.

అతని కెప్టెన్సీలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడు సీజన్లు ఆడింది. 2022, 2023, 2024 సీజన్స్‌లో లక్నోను రాహుల్‌ను నడిపించాడు. తొలి రెండు సీజన్స్‌లో లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరింది. కానీ, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో మాత్రం లక్నో చెత్త ప్రదర్శన కనబర్చింది. 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 7 పరాజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. కాగా, ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా తన టీమ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో అగ్రెసివ్‌గా మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.

టీమిండియా ఆటగాడు, టీమ్‌ కెప్టెన్‌తో ఓనర్‌ ఇలానేనా మాట్లాడేది అంటూ క్రికెట్‌ అభిమానులు సంజీవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే.. ఆ గొడవ తర్వాత.. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో పాటు లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌ను వదిలేస్తాడని చాలా మంది భావించారు. కానీ, ఆ వివాదం తర్వాత సంజీవ్‌ గోయెంకా, రాహుల్‌ను తన ఇంటికి పిలిపించి బుజ్జగించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఐపీఎల్‌ 2025కి ముందు జరిగే వేలంలో టీమ్‌ మొత్తాన్ని ప్రక్షాళన చేసి.. కెప్టెన్‌ను కూడా మార్చుతారని భావిస్తున్నట్లు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆడిన అమిత్‌ మిశ్రా పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments