VVS Laxman: తొలి కప్పు కోసం VVS లక్ష్మణ్‌ను నమ్ముకుంటున్న IPL టీమ్‌!

VVS Laxman, IPL 2025: టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను తమ టీమ్‌ కోచ్‌గా తీసుకోవాలని ఓ ఐపీఎల్‌ టీమ్‌ బలంగా ఫిక్స్‌ అయింది. మరి ఆ టీమ్ ఏది? ఎందుకు లక్ష్మణ్‌ను తీసుకోవాలని ఫిక్స్‌ అయిందో ఇప్పుడు చూద్దాం..

VVS Laxman, IPL 2025: టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను తమ టీమ్‌ కోచ్‌గా తీసుకోవాలని ఓ ఐపీఎల్‌ టీమ్‌ బలంగా ఫిక్స్‌ అయింది. మరి ఆ టీమ్ ఏది? ఎందుకు లక్ష్మణ్‌ను తీసుకోవాలని ఫిక్స్‌ అయిందో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉన్నా.. చాలా టీమ్స్‌ ఇప్పటి నుంచే వచ్చే సీజన్‌పై గట్టిగా ఫోకస్‌ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఒక్కసారిగా కూడా కప్పు కొట్టలేకపోయిన టీమ్స్‌ అయితే ఐపీఎల్‌ 2025పై మరింత ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నాయి. ఎలాగో ఐపీఎల్‌ 2025కి ముందు మెగా వేలం ఉండటంతో.. చాలా ఫ్రాంచైజ్‌లు తమ టీమ్స్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి.. ఆటగాళ్లతో పాటు కొత్త కోచ్‌లను కూడా తీసుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే లక్నో సూపర్‌ జెయింట్స్‌.. టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను తమ కోచింగ్‌ స్టాఫ్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే లక్ష్మణ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

గత మూడేళ్లుగా ఐపీఎల్‌లో ఉన్న లక్నో జట్టు తొలి రెండు సీజన్స్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ 2024 సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. దీంతో.. లక్నో మేనేజ్‌మెంట్‌ జట్టులోని ఆటగాళ్లు, కెప్టెన్‌, కోచింగ్‌ స్టాఫ్‌లో కూడా మార్పులు చేయాలని ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. వీవీఎస్‌ లక్ష్మణ్‌ తనకున్న అనుభవంతో యువ క్రికెటర్లను అద్భుతంగా ట్రైన్‌ చేయగలడని ఆ ఫ్రాంచైజ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. టీమిండియా క్రికెటర్‌గా, ఆ తర్వాత ఐపీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ తరుఫున ఆడిన అనుభవం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచింగ్‌ స్టాఫ్‌లో పనిచేసిన ఎక్స్‌పీరియన్స్‌ను వినియోగించుకోవాలని చూస్తోంది లక్నో సూపర్‌ జెయింట్‌ మెనేజ్‌మెంట్‌.

లక్ష్మణ్‌ ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ ఛైర్మన్‌గా ఉన్నాడు. అలాగే రాహుల్‌ ద్రవిడ్‌ అందుబాటులో లేని సమయంలో పలు సిరీస్‌లకు టీమిండియా తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా కూడా పనిచేశాడు. అతని కోచింగ్‌లో యంగ్‌ టీమిండియా మంచి ప్రదర్శన కనబర్చింది. అందుకే లక్ష్మణ్‌ను తమ కోచింగ్‌ స్టాఫ్‌లోకి తీసుకోవాలని ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్‌ ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ప్రస్తుతం లక్నో హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ జస్టిన్‌ లంగర్‌ ఉన్నాడు. అయితే లక్ష్మణ్‌ను మెంటర్‌ లేదా, బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించే అవకాశం ఉంది. మరి లక్ష్మణ్‌ను లక్నో తమ కోచింగ్‌ స్టాఫ్‌లోకి తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ​

Show comments