iDreamPost
android-app
ios-app

ఈ ఐదుగురు టీమ్‌లోకి వస్తే.. టీ20 వరల్డ్‌ కప్‌ మనదే! రాసి పెట్టుకోండి!

  • Published Apr 06, 2024 | 6:17 PM Updated Updated Apr 06, 2024 | 6:17 PM

5 Best Players For T20 World Cup: ఐపీఎల్‌ 2024లో రాణిస్తున్న కొంతమంది యంగ్‌ ప్లేయర్లను టీమిండియాలోకి తీసుకుని ఆడిస్తే.. టీ20 వరల్డ్‌ కప్‌ మనదే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఐదుగురు ఎవరో ఏంటో ఇప్పుడు చూద్దాం..

5 Best Players For T20 World Cup: ఐపీఎల్‌ 2024లో రాణిస్తున్న కొంతమంది యంగ్‌ ప్లేయర్లను టీమిండియాలోకి తీసుకుని ఆడిస్తే.. టీ20 వరల్డ్‌ కప్‌ మనదే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఐదుగురు ఎవరో ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 06, 2024 | 6:17 PMUpdated Apr 06, 2024 | 6:17 PM
ఈ ఐదుగురు టీమ్‌లోకి వస్తే.. టీ20 వరల్డ్‌ కప్‌ మనదే! రాసి పెట్టుకోండి!

ప్రస్తుతం దేశం మొత్తం ఐపీఎల్‌ ఫీవర్‌తో ఊగిపోతోంది. క్రికెట్‌ అభిమానులంతా ధూమ్‌ ధాం క్రికెట్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌లో భారత యువ క్రికెటర్లు చాలా మంది అదరగొడుతున్నారు. స్టార్‌ ప్లేయర్ల కన్నా.. వారే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నారు. అందులో చాలా మంది వీలైనంత త్వరగానే టీమిండియాలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఓ ఐదుగురి పేర్లు మాత్రం కచ్చితంగా టీమిండియా లిస్ట్‌లో ఉంటాయని క్రికెట్‌ అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. మరి ఆ ఐదుగురు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ ఎంత జోరుగా సాగినా.. టీమిండియాకి, రోహిత్‌ శర్మకు ఉన్న బిగ్‌ టార్గెట్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను సాధించడం. ఇప్పటికే గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023ను చివరి మెట్టుపై టీమిండియా చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే టీ20 వరల్డ్‌ కప్‌ను ఎలాగైన గెలవాలనే కసితో రోహిత్‌ శర్మ ఉన్నాడు. రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, బుమ్రా లాంటి స్టార్‌ ప్లేయర్లు ఎలాగో టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉంటారు. వీరి కాకుండా మరే ప్లేయర్‌ పేరు కూడా ఇప్పుడు ఎవరూ కన్ఫామ్‌ చేయలేరు. కానీ, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సంచలనాలు సృష్టిస్తున్న కొంతమంది యువ క్రికెటర్ల మాత్రం టీమ్‌లో ప్లేస్‌ కోసం గట్టి పోటీ ఇస్తున్నారు. ఓ ఐదు ఆటగాళ్లు టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం.. రాసి పెట్టకోండి.. టీ20 వరల్డ్‌ కప్‌ మనదే అంటున్నారు క్రికెట్‌ పండితులు.

మరి ఆ ఐదుగురు ఎవరంటే.. అభిషేక్‌ శర్మ, మయాంక్‌ యాదవ్‌, రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌, శివమ్‌ దూబే. ప్రస్తుతం ఈ ముగ్గురు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడుతున్న అభిషేక్‌ శర్మ ప్లేయర్‌ ప్లేలో పవర్‌ ఫుల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ముఖ్యంగా అతని ఇంటెంట్‌ అద్భుతంగా ఉంది. ఇక మయాంక్‌ యాదవ్‌ తన స్పీడ్‌ బౌలింగ్‌తో మొత్తం క్రికెట్‌ ప్రపంచాన్నే భయపెడుతున్నాడు. 156 కిలో మీటర్ల వేగంతో పాటు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెన్త్‌తో సూపర్‌ బౌలింగ్‌ వేస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో బుమ్రాకి తోడుగా మయాంక్‌ ఉంటే.. ప్రత్యర్థి జట్టు కుప్పకూలాల్సిందే. రింకూ సింగ్‌.. ఆల్రెడీ టీమిండియాలోకి ఎంట్రీ కొన్ని మ్యాచ్‌లు ఆడిన ఈ పాకెట్‌ డైనమైట్‌.. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో కచ్చితంగా ఉంటాడనే టాక్‌ వినిపిస్తోంది. తన సూపర్‌ బ్యాటింగ్‌తో బెస్ట్‌ ఫినిషర్‌గా పేరుతెచ్చకున్నాడు. ఇంక ఫీల్డింగ్‌ కూడా అద్భుతంగా చేస్తాడు.

అలాగే రియాన్‌ పరాగ్‌.. కెరీర్‌ ఆరంభంలో ఓవర్‌ యాక్షన్‌ స్టార్‌, యాటీట్యూడ్‌ స్టార్‌గా పేరుతెచ్చుకున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు సంచలన బ్యాటింగ్‌తో.. ఆరెంజ్‌ క్యాప్‌ కోసం విరాట్‌ కోహ్లీతోనే పోటీ పడే స్థాయికి ఎదిగాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో రాజస్థాన్‌ జట్టుకు కొండంత అండగా మారాడు. టీమిండియాలోకి వస్తే.. భారత బ్యాటింగ్‌ చాలా బలపడుతుందని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌.. శివమ్‌ దూబే, చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ఆడుతూ రాటుదేలిన ఈ కుర్రాడు. ఆల్‌రౌండర్‌గా పాండ్యా ప్లేస్‌ను భర్తీ చేసి.. టీమిండియాకు బిగ్‌ అసెట్‌లా మారేలా ఉన్నాడు. ఈ ఐదుగురిని టీమిండియాలోకి తీసుకుని.. రోహిత్‌, కోహ్లీ, బుమ్రా లాంటి సీనియర్లతో కలిపి ఆడిస్తే కచ్చితంగా కప్పు మనదే అని చాలా మంది నమ్ముతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet