ఏ ఆటలోనైనా ఎవరూ రాత్రికి రాత్రే స్టార్లు అయిపోరు. కొన్నేళ్ల కష్టం, కృషి, పట్టుదల ఉంటేనే ఎవరైనా అత్యున్నత స్థాయికి చేరుకోగలరు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని నిలకడగా రాణించే వారికి తిరుగుండదు. ఇది క్రికెట్లోనూ వర్తిస్తుంది. డొమెస్టిక్ లెవల్లో బాగా ఆడే ప్లేయర్లకు నేషనల్ టీమ్‌లో ప్లేస్ లభిస్తుంది. అక్కడ కూడా తమను తాము నిరూపించుకొని, నిలకడగా రాణిస్తే స్టార్లు అయిపోవచ్చు. క్రికెట్లో ఇప్పుడంటే లీగ్‌ల్లో ఆటతీరును బట్టి ప్లేయర్లను సెలెక్ట్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం దేశవాళీ పెర్ఫార్మెన్స్ను బట్టే ఆటగాళ్లను తీసుకునేవారు.
దేశవాళ్లీలో రాణించిన ఆటగాళ్లలో ఓపిక, పట్టుదల, బాగా ఆడాలనే తపన, కసి ఎక్కువగా కనిపించేది. జాతీయ జట్టుకు బాగా ఆడితే పేరు, ప్రఖ్యాతులతో పాటు మంచి సంపాదన కూడా ఉంటుందని భావించేవారు. కానీ ఇప్పుడు లీగ్‌ల వల్ల ధనార్జనకు కొదువ లేకుండా పోయింది. అయితే లీగ్‌ల హవా ఇంత ఉన్న సమయంలోనూ కొన్ని దేశాలు దేశవాళీలను పటిష్టంగా మార్చుకుంటున్నాయి. డొమెస్టిక్ లెవల్లో బాగా ఆడిన ప్లేయర్లకు పిలిచి మరీ టీమ్‌లో చోటు కల్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్-2023లో హ్యాంప్‌షైర్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
వార్విక్షైర్తో గురువారం జరిగిన సెమీస్‌లో హ్యాంప్‌షైర్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హ్యాంప్‌షైర్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ చెలరేగిపోయాడు. అతడు తన స్పిన్ మాయాజాలంతో వార్విక్షైర్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. డాసన్ స్పిన్ ఉచ్చులో పడి ప్రత్యర్థి జట్టు విలవిల్లాడింది. అతడు తాను వేసిన మొదటి 10 బంతుల్లో రన్స్ ఏమీ ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా డాసన్ ఈ మ్యాచ్‌లో 6.5 ఓవర్లు వేసి 7 వికెట్లు పడగొట్టాడు. వార్విక్షైర్ నిర్దేశించిన 94 పరుగుల లక్ష్యాన్ని హ్యాంప్‌షైర్ టీమ్ 19.1 ఓవర్లలో ఆడుతూపాడుతూ ఛేదించింది.
7 FOR 15!
Outstanding from Liam Dawson 👏pic.twitter.com/vVqMrDrmf9
— The Cricketer (@TheCricketerMag) August 29, 2023