iDreamPost
android-app
ios-app

బార్బర్ కు డబ్బులు ఎగ్గొట్టిన ఆసీస్ క్రికెటర్! వార్నింగ్ ఇచ్చి.. డెడ్ లైన్ పెట్టిన బార్బర్

  • Author Soma Sekhar Published - 04:20 PM, Sat - 8 July 23
  • Author Soma Sekhar Published - 04:20 PM, Sat - 8 July 23
బార్బర్ కు డబ్బులు ఎగ్గొట్టిన ఆసీస్ క్రికెటర్! వార్నింగ్ ఇచ్చి.. డెడ్ లైన్ పెట్టిన బార్బర్

‘అదృష్టం అడ్డం తిరిగితే.. అరటి పండు తిన్నా పన్నూడుద్ది’. ఇప్పుడు ఈ సామెత అచ్చంగా సరిపోతుంది ఓ ఆసీస్ క్రికెటర్ కు. ఆ ఆటగాడు ఎవరో కాదు.. బెయిర్ స్టో ఔట్ వివాదంలో ఇంగ్లీష్ మీడియా నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అలెక్స్ కేరీ. అవును బెయిర్ స్టో అవుట్ వివాదంతో ఇప్పటికే తీవ్ర విమర్శల పాలవుతున్న అలెక్స్ కేరీ.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. కటింగ్ చేయించుకోని తనకు డబ్బులు ఇవ్వకుండా వెళ్లాడని ఓ బార్బర్ ప్రముఖ న్యూస్ ఛానల్ తో వెల్లడించాడు. అదీకాక తనకు డబ్బులు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చి మరీ డెడ్ లైన్ పెట్టాడు.

అలెక్స్ కేరీ.. ప్రస్తుతం ఈ పేరు యాషెస్ సిరీస్ లో మారుమ్రోగిపోతోంది. అయితే ఇది అతడి ఆటతీరుతో కాదు.. అతడి ప్రవర్తనతో. మెున్న ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో ఔట్ వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అలెక్స్ కేరీ.. మరోసారి చిక్కుల్లో పడ్డాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఆడుతున్న కేరీ.. అక్కడ ఓ బార్బర్ షాప్ లో కటింగ్ చేయించుకున్నాడు. ఓ రోజు సాయంత్ర కేరీ, వార్నర్, ఖవాజాలు కటింగ్ చేయించుకోవడానికి బార్బర్ షాప్ కు వెళ్లారు. అక్కడ షాప్ లో ఫొటోలు సైతం దిగారు. ఈ క్రమంలోనే కటింగ్ చేయించుకున్న అలెక్స్ కేరీ.. ఫొటోలు దిగకుండానే, డబ్బులు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బార్బర్ ఆడమ్ మహమూద్ తెలియజేశాడు.

ఆడమ్ మహమూద్ మాట్లాడుతూ..”నా షాప్ కు కేరీ, వార్నర్, ఖవాజాలతోపాటుగా.. మరికొంత మంది క్రికెటర్లు వచ్చారు. వారికి నేను కటింగ్ చేశాను. అయితే కేరీ దగ్గర డబ్బులు లేవు. అదీకాక మా షాపులో కార్డ్స్ ఏవీ తీసుకోట్లేదు. దాంతో నేను పక్కనే ఏటీఎమ్ ఉంది డబ్బులు తీసుకుని రమ్మని కేరీకి చెప్పాను. ఇక వారందరు షాప్ లో ఫొటోలు దిగి వెళ్లిపోయారు. బహుశా.. కేరీ డబ్బులు ఇవ్వడం మర్చిపోయి ఉండవచ్చు. నేను అతడికి ఒకటే చెబుతున్నా.. అతడు నాకు సోమవారం వరకు డబ్బులు ఇవ్వాలి. లేకపోతే నేను ఊరుకోను. నేను సంతోషంగా కూడా ఉండను” అంటూ వార్నింగ్ సైతం ఇచ్చాడు ఆడమ్ మహమూద్. తనకు చెల్లించే £30 డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. మరి ఆడమ్ మహమూద్ చేసిన వ్యాఖ్యలపై అలెక్స్ కేరీ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss