iDreamPost
android-app
ios-app

విరాట్‌ కోహ్లీ సెంచరీ.. షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న లేడీ ఫ్యాన్‌!

మాకు లేరెవరు పోటీ మాకు మేమే సాటి అన్నరీతిలో రోహిత్ సేన వన్డే వరల్డ్ కప్ లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో విజయ దుందిభి మోగించింది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా ఆ విధంగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రపంచకప్ లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

మాకు లేరెవరు పోటీ మాకు మేమే సాటి అన్నరీతిలో రోహిత్ సేన వన్డే వరల్డ్ కప్ లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో విజయ దుందిభి మోగించింది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా ఆ విధంగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రపంచకప్ లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

విరాట్‌ కోహ్లీ సెంచరీ.. షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న లేడీ ఫ్యాన్‌!

వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో విజయ దుందిభి మోగించింది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా ఆ విధంగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రపంచకప్ లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే నిన్న (గురువారం) పూణే వేదికగా భారత్, బంగ్లా మధ్య కీలక మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ బంగ్లాపై సూపర్ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ వీరాభిమాని అయిన ఓ లేడీ ఫ్యాన్ ప్లకార్డ్ పట్టుకుని కోహ్లీ సెంచరీ చేస్తే ఆ పని చేస్తానంటూ రచ్చ రచ్చ చేసింది. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింటా వైరల్ గా మారింది.

మాకు లేరెవరు పోటీ మాకు మేమే సాటి అన్నరీతిలో రోహిత్ సేన వన్డే వరల్డ్ కప్ లో అదరగొడుతోంది. కాగా భారత్, బంగ్లా మ్యాచ్ సందర్భంగా లేడీ ఫ్యాన్ కోహ్లీ బ్యాటింగ్ ఉద్దేశిస్తూ ఓ ప్లకార్డ్ చేత పట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఆ ప్లకార్డులో ఆ యువతి ఏం రాసిందంటే? కోహ్లీ సెంచరీ చేస్తే నేను నా బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్తానంటూ సంచల నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ శతక్కొట్టాడు. ఈ క్రమంలో ఆమెపై నెటిజన్లు సరదా ప్రశ్నలతో ఆటపట్టిస్తున్నారు. ఇంతకీ మీ లవ్ కి బ్రేకప్ చెప్పారా లేదా అని కొందరు, విరాట్ ఎలాగు సెంచరీ చేస్తాడని తెలిసే డైరెక్టుగా బ్రేకప్ చెప్పలేక ఈ సెంచరీని ఓ సాకుగా వాడుకున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు.

కాగా నిన్న జరిగిన భారత్, బంగ్లా మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆరంభంలో అదరగొట్టినా ఆతర్వాత చతికిల పడింది. భారత బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఓపెనర్లు రోహిత్, గిల్ మెరుపు బ్యాటింగ్ తో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక ఛేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ బ్యాటు ఝుళిపించి పరుగుల వరద పారించాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో చెలరేగి సెంచరీ చేశాడు. దీంతో భారత్ బంగ్లాపై ఘన విజయం సాధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి