iDreamPost
android-app
ios-app

IPL 2024: కుల్దీప్ తన అస్త్రాలు దాచిపెడుతున్నాడు.. స్టార్ బ్యాటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published May 11, 2024 | 3:39 PM Updated Updated May 11, 2024 | 3:39 PM

కుల్దీప్ యాదవ్ గురించి ఇంతవరకు ఎవ్వరికీ తెలియని నిజాలు బయటపెట్టాడు ఢిల్లీ సంచలన ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం పదండి.

కుల్దీప్ యాదవ్ గురించి ఇంతవరకు ఎవ్వరికీ తెలియని నిజాలు బయటపెట్టాడు ఢిల్లీ సంచలన ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం పదండి.

  • Published May 11, 2024 | 3:39 PMUpdated May 11, 2024 | 3:39 PM
IPL 2024: కుల్దీప్ తన అస్త్రాలు దాచిపెడుతున్నాడు.. స్టార్ బ్యాటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఈ ఐపీఎల్ సీజన్ లో అనూహ్యంగా పుంజుకుని ప్లే ఆఫ్స్ రేసులోకి దూకొచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. వరుసగా స్ట్రాంగ్ టీమ్స్ కు షాకిస్తూ.. తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడి  అందులో 6 గెలిచి, 6 మ్యాచ్ ల్లో ఓడిపోయి, 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. అయితే ఈ జట్టు చిచ్చర పిడుగు, సౌతాఫ్రికా సంచలన ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ తన సహచర ప్లేయర్ కుల్దీప్ యాదవ్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు బయటపెట్టాడు. అవేంటంటే?

సాధారణంగా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో ఆడిన షాట్స్ నే గేమ్ లో ఆడుతుంటారు. ఇక బౌలర్లు సైతం ప్రాక్టీస్ లో ఏవింధంగా బంతులు సంధించారో.. అదే విధంగా వేస్తారు. అయితే పరిస్థితులను బట్టి ప్లేయర్లు తమ వ్యూహాలను మారుస్తూ ఉంటారు ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే సొంత టీమ్ ప్లేయర్లకు కూడా ప్రాక్టీస్ లో తమ స్ట్రెంత్ బాల్స్ ఏవో.. అవి కూడా వేయడు అంటూ కుల్దీప్ యాదవ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు ఢిల్లీ చిచ్చర పిడుగు ట్రిస్టన్ స్టబ్స్. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న స్టబ్స్ మాట్లాడుతూ..”కుల్దీప్ యాదవ్ ప్రాక్టీస్ లో మాకు అసలైన బంతులు వేయడు. అంటే తన సీక్రెట్ వెపన్స్ ను లాంటి బంతులను మాకు వేయడు. దీనిని నేను గమనించా” అంటూ కుల్దీప్ సీక్రెట్ ను బట్టబయలు చేశాడు స్టబ్స్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

కాగా.. ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ ల్లో ఆకాశమేహద్దుగా చెలరేగిపోతున్నాడు స్టబ్స్. ఇటీవలే ముంబైతో ముగిసిన మ్యాచ్ లో కేవలం 25 బంతుల్లోనే 48 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇప్పటి వరకు స్టబ్స్ 12 మ్యాచ్ ల్లో 318 పరుగులు చేశాడు. అందులో రెండు ఫిఫ్టీలు ఉన్నాయి. ఇక కుల్దీప్ విషయానికి వస్తే..  9 మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీసుకున్నాడు. మరి తన అస్త్రాలను దాచి పెడుతున్నాడు అన్న స్టబ్స్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş