iDreamPost
android-app
ios-app

హ్యాట్సాఫ్‌ రాహుల్! ఈ ఆటతో మరో యువరాజ్ కాబోతున్నాడా?

  • Published Oct 09, 2023 | 6:11 PM Updated Updated Oct 09, 2023 | 7:11 PM
  • Published Oct 09, 2023 | 6:11 PMUpdated Oct 09, 2023 | 7:11 PM
హ్యాట్సాఫ్‌ రాహుల్! ఈ ఆటతో మరో యువరాజ్ కాబోతున్నాడా?

క్రికెట్‌లో ఓ జట్టు వరల్డ్‌ కప్‌ గెలవాలంటే.. టీమ్‌ ఎంతో పటిష్టంగా ఉండాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అదరగొట్టాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడి, కలబడేలా ఉండాలి. ఇలా ఎన్ని బెస్ట్‌ క్వాలిటీస్‌ ఉన్నా కూడా.. క్లిష్టపరిస్థితుల్లో అడ్డుగోడలా నిలబడిపోతూ.. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బాగా ఆడుతూ.. మ్యాచ్‌లు గెలిపించే ఓ మ్యాచ్‌ విన్నర్‌ ఉంటేనే ఆ జట్టు వరల్డ్‌ కప్‌ గెలిచి విశ్వవిజేతగా నిలుస్తుంది. 2011లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిచిందంటే యువరాజ్‌ సింగ్‌ ఓ మ్యాచ్‌ విన్నర్‌ టీమిండియాకు వరంలా దొరకడమే కారణం. యువీ లేకుండా వరల్డ్‌ కప్‌లో టీమిండియా విజయాన్ని ఊహించలేం. ఎంత బలమైన జట్టుకైనా.. అలాంటి ఓ ప్లేయర్‌ ఉండాల్సింది. కానీ, అన్నీ ఉన్నా ఏ లోపంలా, లోటులా ఉంటుంది. అలాంటి ప్లేయర్‌ లేకుండా టోర్నీలో ఎంత ముందుకు వెళ్లినా.. ఫైనల్‌గా కప్పు కొట్టడం కష్టం. ప్రస్తుతం వన్డే వరల్డ్‌ కప్‌ 2023 జరుగుతున్న తరుణంలో టీమిండియాలో అలాంటి ప్లేయర్‌ ఎవరున్నారని ఆలోచిస్తే.. ఓ పేరు వినిపిస్తుంది. అతనే కేఎల్‌ రాహుల్‌.

టీమిండియాలోకి ఓ సంచలనంలా దూసుకొచ్చిన కేఎల్‌ రాహుల్‌.. వైస్‌ కెప్టెన్‌గా చాలా కాలం కొనసాగాడు. టెక్నికల్‌గా రాహుల్‌ ఫుల్‌ సౌండ్‌. ప్రాపర్‌ క్రికెట్‌ ఎలా ఆడాలో రాహుల్‌ను చూస్తే అర్థమైపోతుంది. క్లాస్‌ క్రికెట్‌కు అతనో టెక్ట్స్‌ బుక్‌. అలాంటి ఓ ఆటగాడు.. గాయాల కారణంగా టీమ్‌కు దూరం అయ్యాడు. అంతకంటే ముందు ఓపెనర్‌గా పలు మ్యాచ్‌ల్లో విఫలం అవుతూ.. టీమిండియాకు భారంగా మారాడు. జట్టులో ఇతనుండటం దండగా అనే రేంజ్‌లో క్రికెట్‌ ఫ్యాన్స్‌ అతనిపై విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో గాయంతో.. టీమిండియాకు దూరమైన రాహుల్‌, చికిత్స అనంతరం నిదానంగా కోలుకుని టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

ఆ టైమ్‌లో రాహుల్‌ను టీమ్‌కు ఎందుకు తీసుకుంటున్నారనే విమర్శలు కూడా వినిపించాయి. కానీ, రాహుల్‌ క్యాలిబర్‌, స్టామినా ఏంటో బాగా తెలిసిన హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతన్ని బ్యాక్‌ చేశారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆసియా కప్‌ 2023లో పాకిస్థాన్‌పై సెంచరీతో తన రీఎంట్రీని ఘనంగా చాటుకుంటూ.. తనపై వచ్చిన విమర్శలకు ఆ సెంచరీతోనే బదులిచ్చాడు. అలాగే వన్డే వరల్డ్‌ కప్‌కి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేల్లో వరుస హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టాడు. వరల్డ్‌ కప్‌ ముందు టీమిండియాకు కొండంత బలం ఇచ్చాడు. ఒక సూపర్‌ టెక్నిక్‌ ఉన్న ఆటగాడు ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు.

తాజాగా ఆస్ట్రేలియాతోనే జరిగిన వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌నే తీసుకుంటే.. ఎంత క్లిష్టపరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చాడో మనం చూశాం. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లోకి వచ్చి కోహ్లీతో కలిసి అద్భుతంగా ఆడి.. ముందు ఒత్తిడిని ఓడించి, తర్వాత ఆస్ట్రేలియాను ఓడించాడు. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు ఎలా అయినా ఆడగలిగే రాహుల్‌.. వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో వన్డే టెస్టు స్టైల్లో ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌ అనే కాదు.. రాహుల్‌ కెరీర్‌నే తీసుకుంటే అతనో వారియర్‌ అనే చెప్పాలి. టీమ్‌లకి వచ్చిన విధానం, ఆడిన తీరు.. బ్యాడ్‌ ఫామ్‌, గాయాలను ఓవర్‌ కమ్‌ చేసిన విధానం.. ఇప్పుడు అతను చూపిస్తున్న ఇంటెంట్‌ అన్నీ ఓ గొప్ప ఆటగాడికి ఉన్న లక్షణాలే. అందుకే.. ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు కావాల్సిన మ్యాచ్‌ విన్నర్‌ కేఎల్‌ రాహులే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ రూపంలో టీమిండియా అద్బుతమైన టాపార్డర్‌ ఉంది. వీరి ముగ్గురిలో ఏ ఒక్కరు నిలబడినా మ్యాచ్‌ మనదే. కానీ, వీరి ముగ్గురు విఫలమైనా కూడా కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్‌ను గెలిపించగల ఆటగాడు. ప్రస్తుతం అతనున్న ఫామ్‌ చూస్తే అది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ముఖ్యంగా వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌ మిడిల్డార్‌కి వందకు వందశాతం న్యాయం చేస్తుంటాడు. మిడిల్‌ ఓవర్స్‌లో స్పిన్‌ బాగా ఆడుతూ.. రన్‌రేట్‌ పడిపోకుండా బ్యాటింగ్‌ చేస్తుంటాడు. ఇక మంచి స్టార్‌ లభిస్తే.. బిగ్‌ ఇన్నింగ్స్‌ ఆడటంలో కేఎల్‌ ది డిఫరెంట్‌ స్టైల్‌. చివరి 10 ఓవర్లు రాహుల్‌ ఎలాంటి బ్యాటింగ్‌ చేస్తాడో మనందరికి తెలిసిందే. గేర్‌మార్చేసి హార్డ్‌ హిట్టర్‌గా, ఫినిషర్‌గా మారిపోతాడు. ఇన్ని అద్భుతమైన క్వాలిటీస్‌, ప్రస్తుతం అతనున్న ఫామ్‌, అతను దాటొచ్చి టఫ్‌ కండీషన్స్‌ అన్నీ.. రాహుల్‌ను ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు కీ ప్లేయర్‌గా మార్చేశాయనే చెప్పాలి. మరి రాహుల్‌ ఆడుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఓడిపోతాం అనుకున్న మ్యాచ్‌ల్లో.. కోహ్లీ గెలిపించిన బెస్ట్‌ 6 మ్యాచ్‌లు ఇవే!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet