KL Rahul: కేఎల్‌ రాహుల్‌ మాస్టర్‌ మైండ్‌! మ్యాచ్‌లో ఎవరూ గమనించని మూమెంట్‌!

సౌతాఫ్రికాతో అద్భుత సెంచరీతో చెలరేగడంతో పాటు టీమిండియాను ఆదుకున్న కేఎల్‌ రాహుల్‌.. ఇదే మ్యాచ్‌లో ఒక దొంగతనం కూడా చేశాడు. నిజానికి దాని వల్లే అతను సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో అద్భుత సెంచరీతో చెలరేగడంతో పాటు టీమిండియాను ఆదుకున్న కేఎల్‌ రాహుల్‌.. ఇదే మ్యాచ్‌లో ఒక దొంగతనం కూడా చేశాడు. నిజానికి దాని వల్లే అతను సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

సెంచూరియన్‌ వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో రెండు హోరాహోరీగా తలపడుతున్నాయి. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ప్రస్తుతం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి.. మూడో రోజు ఆటను కొనసాగించనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఎంతో క్లిష్టపరిస్థితుల్లో ఉన్న టీమిండియాను ఆదుకోవడమే కాకుండా.. నిప్పులు చెరుగుతున్న సౌతాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీతో టీమిండియా మంచి గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో సెంచరీ కంటే ముందు రాహుల్‌ చేసిన ఓ దొంగతనం గురించి మాట్లాడుకోవాలి.

అదేంటి క్రికెట్‌లో దొంగతనం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఒక రకంగా రాహుల్‌ చేసింది అలాంటిదే మరి. ఎంతో చాకచక్యంగా సౌతాఫ్రికా నుంచి బైస్‌ రూపంలో ఒక రన్‌ను దొంగిలించాడు రాహుల్‌. ఈ మూమెంట్‌ను చాలా మంది క్రికెట్‌ అభిమానులు సైతం గుర్తించి ఉండరు. అదేంటంటే.. కేఎల్‌ రాహుల్‌ సెంచరీకి 5 పరుగుల దూరంలో ఉన్న సమయంలో 66వ ఓవర్‌ తొలి బంతికే మొహమ్మద్‌ సిరాజ్‌ 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే ఇండియా స్కోర్‌ 238. కేఎల్‌ రాహుల్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు మరింత అద్భుతమైన ముగింపు దక్కలాంటే అతను సెంచరీ మార్క్‌ను పూర్తి చేయాలి. రాహుల్‌ 95 పరుగుల వద్ద సమయంలో చివరి బ్యాటర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ క్రీజ్‌లోకి వచ్చాడు. ఎలాగో కొత్త బ్యాటర్‌ స్ట్రైక్‌ తీసుకోవాలి కాబట్టి.. కేఎల్‌ రాహుల్‌కు ప్రసిద్ధ్‌ కృష్ణ స్ట్రైక్‌ ఇవ్వగలడా అనే అనుమానం అందరిలో కలిగింది. అదే అనుమానం రాహుల్‌లో కూడా ఉంది. గెరాల్డ్ కోయెట్జీ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అప్పటికే ఆ ఓవర్‌ తొలి బంతికి సిరాజ్‌ను అవుట్‌ చేశాడు. ఇక ప్రసిద్ధ్‌ను అవుట్‌ చేస్తే.. టీమిండియా ఇన్నింగ్స్‌ ముగుస్తుంది. పాపం అద్భుతంగా ఆడిన రాహుల్‌ 95 పరుగుల వద్ద నాటౌట్‌గా మిగిలిపోతాడు.

కానీ, రాహుల్‌ అలా జరగనివ్వలేదు. ప్రసిద్ధ్‌.. కోయెట్జీని ఎదుర్కొడానికి ఇబ్బంది పడుతూనే ఓ రెండు బంతులు ఆడాడు. అయితే.. ప్రసిద్ధ్‌ బాల్‌ని టచ్‌ చేయడులే అని ధీమాలో ఉన్న సౌతాఫ్రికా వికెట్ కీపర్‌ కైల్‌ వెర్రియన్‌.. తాపీగా బాల్‌ను చేతుల్లోకి తీసుకోని.. నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న రాహుల్‌ను చూడకుండా.. బాల్‌ను స్పిల్‌లో నిల్చున్న ఫీల్డర్‌కు ఇస్తున్నాడు. ఇది గమనించిన రాహుల్‌.. కోయెట్జీ వేసిన మూడో బంతి కీపర్‌ చేతుల్లోకి వెళ్లగానే.. అతను స్లిప్‌ ఫీల్డర్‌ వైపు తిరగ్గానే.. పరుగు అందుకున్నాడు. దీంతో బైస్‌ రూపంలో సింగిల్‌ రావడంతో రాహుల్‌ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇలా ఎంతో తెలివిగా ఆలోచించి.. సౌతాఫ్రికా వికెట్‌ కీపర్‌ ఆలసత్వాన్ని ఆసరగా చేసుకుని.. సింగిల్‌ దొంగిలించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందుకు ప్రసిద్ధ్‌ కృష్ణ సైతం బాగా సహకరించాడు. మరి కేఎల్‌ రాహుల్‌ తెలివిగా ఆలోచించి.. సింగిల్‌ దొంగిలించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments