VIDEO: ప్రాక్టీస్‌లో కేఎల్‌ రాహుల్‌ విధ్వంసం! ఫ్యాన్స్‌ నుంచి వింత రియాక్షన్‌

ఆసియా కప్‌ 2023 టీమిండియా రెడీ అవుతుంది. రేపటి నుంచి పాకిస్థాన్‌-నేపాల్‌ మధ్య మ్యాచ్‌తో ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 17 వరకు ఈ మినీ వరల్డ్‌ కప్‌ జరగనుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్‌-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. సెప్టెంబర్‌ 2న హైఓల్టేజ్‌ మ్యాచ్‌ భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసమే యావత్‌ క్రికెట్‌ లోకం ఎదురుచూస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్‌ తమ తొలి కోసం రెడీ అయిపోయింది. ఇక భారత్‌.. ప్రస్తుతం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతోంది. ఆసియా కప్‌లో తమ తొలి మ్యాచ్‌ను టీమిండియా.. పాక్‌తోనే ఆడనుంది.

ఈ మ్యాచ్‌పై ఎంత భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో పాకిస్థాన్‌పై కచ్చితంగా గెలిచి తీరాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అందుకోసమే ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తోంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. గాయంతో టీమిండియాకు దూరమైన రాహుల్‌.. చాలా కాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో అతను ఎలా ఆడతాడో అనే అనుమానం అందరిలో నెలకొంది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ సైతం కేఎల్‌ రాహుల్‌తో పాటు, గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌పై ఫోకస్‌ పెట్టారు.

ప్రాక్టీస్‌లో వారికి ఎక్కువగా గేమ్‌ టైమ్‌ ఇస్తూ.. పాక్‌తో మ్యాచ్‌ కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌ ప్రాక్టీస్‌లో రెచ్చిపోయి ఆడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ సిక్సులతో రాహుల్‌ విరుచుకుపడుతుంటే.. క్రికెట్‌ అభిమానులు మాత్రం.. ‘రాహుల్‌ భయ్యా.. ప్రాక్టీస్‌లో కాదు అసలైన మ్యాచ్‌లో ఇలానే ఆడాలి’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. గాయం కంటే ముందు రాహుల్‌ బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. చాలా స్లోగా ఆడుతున్నాడని, టీమిండియాకు సరైన ఓపెనింగ్‌ ఇవ్వలేకపోతున్నాడంటూ రాహుల్‌ను అప్పట్లో భారత క్రికెట్‌ అభిమానులు ఓ ఆట ఆడుకున్నారు. మరి కిందున్న రాహుల్‌ ప్రాక్టీస్‌ వీడియో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: జీవితంపై విరక్తి చెందిన సమయంలో యువీ అండగా నిలబడ్డాడు: రోహిత్‌ శర్మ

Show comments