SNP
KL Rahul, MS Dhoni, CSK vs LSG: ఐపీఎల్ 2024లో కొన్ని అద్భుతమైన సీన్లు కనిపిస్తున్నాయి. తాజాగా లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ చేసిన ఒక పని క్రికెట్ అభిమానుల మనసు దోచేసింది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
KL Rahul, MS Dhoni, CSK vs LSG: ఐపీఎల్ 2024లో కొన్ని అద్భుతమైన సీన్లు కనిపిస్తున్నాయి. తాజాగా లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ చేసిన ఒక పని క్రికెట్ అభిమానుల మనసు దోచేసింది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై ఓపెనర్లు విఫలం అయినా.. సీనియర్ బ్యాటర్లు రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, మొయిన్ అలీ రాణించడంతో ఓ ఫైటింగ్ టార్గెట్‌ను లక్నో ముందు పెట్టింది సీఎస్‌కే. కానీ, ఆ టార్గెట్ కేఎల్ రాహుల్ ముందు అస్సలు సరిపోలేదు. మరో ఓవర్ మిగిలి ఉండగానే కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో లక్నో ఈ మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. కెప్టెన్‌గా అద్భుతమైన బౌలింగ్ మార్పులతో పాటు బ్యాటింగ్ 82 రన్స్ చేసి, అలాగే రెండు మంచి క్యాచెస్ పట్టి.. గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
సీఎస్‌కే లాంటి స్టార్ టీమ్, పటిష్టమైన జట్టును లక్నో సూపర్ జెయింట్స్ ఓడించిందంటే.. అందుకే కేఎల్ రాహులే ప్రధాన కారణం. అతనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా నిలిచాడు. అయినా కూడా రాహుల్‌లో ఇసుమంతైన గర్వం కనిపించలేదు. పైగా ధోని లాంటి దిగ్గజ క్రికెటర్‌తో మ్యాచ్ తర్వాత షేక్ ఇస్తూ.. తన క్యాప్ తీసి మరీ గౌరవించాడు. అది ధోనికి రాహుల్ ఇచ్చే మర్యాద అంటూ క్రికెట్ అభిమానులు అంటున్నారు. ధోని లాంటి గొప్ప క్రికెటర్ ఉన్న టీమ్‌ను ఓడించిన తర్వాత.. ధోనిని కలుస్తూ.. తన పట్ల ఉన్న గౌరవాన్ని కేఎల్ రాహుల్ ఇలా చాటుకున్నాడు. మ్యాచ్ మొత్తం తానే అయినా లక్నోను గెలిపించి, చెన్నైని ఓడించినా.. ఒక గొప్ప క్రికెటర్ ఎదురుగా వస్తే మాత్రం అతనికి ఇవ్వాల్సిన గౌరవం అతనికి ఇచ్చి.. కేఎల్ రాహుల్ ప్రశంసలు అందుకుంటున్నాడు.
తాజాగా రాహుల్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది క్రికెట్ అభిమానులు రాహుల్ క్యాప్ తీసి, ధోనికి షేక్ హ్యాండ్ ఇస్తున్న వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఒక సీనియర్ క్రికెటర్, దిగ్గజ క్రికెటర్లతో కలుస్తున్న సమయంలో క్రికెటర్లు క్యాప్ తీసి.. షేక్ హ్యాండ్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. చాలా మంది క్రికెటర్లు ఇదే ఫాలో అవుతూ ఉంటారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జడేజా 57, మొయిన్ అలీ 30, ధోని 28 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. ఇక 177 పరుగుల టార్గెట్‌తో దిగిన లక్నో 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 180 పరుగుల చేసి గెలిచింది. కేఎల్ రాహుల్ 82, క్వింటన్ డికాక్ 54 రన్స్‌తో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో ధోనిని కలిసే సమయంలో రాహుల్ క్యాప్ తీసి షేక్ హ్యాండ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A Humble person with Zero attitude 😌❤️. pic.twitter.com/iAIjnIpNiG
— ADARSH_18 (@Vk_18_ads) April 20, 2024