Nidhan
India vs Sri Lanka: పోటీ లేదు, మనకు సాటిలేదని అనుకుంటే శ్రీలంక లాంటి ప్రభ కోల్పోయిన టీమ్ చేతిలో భారత్ ఓడిపోయింది. వైట్‌వాష్ చేస్తుందని అనుకుంటే.. వరుస మ్యాచుల్లో ఓడి సిరీస్‌ను పోగొట్టుకుంది.
India vs Sri Lanka: పోటీ లేదు, మనకు సాటిలేదని అనుకుంటే శ్రీలంక లాంటి ప్రభ కోల్పోయిన టీమ్ చేతిలో భారత్ ఓడిపోయింది. వైట్‌వాష్ చేస్తుందని అనుకుంటే.. వరుస మ్యాచుల్లో ఓడి సిరీస్‌ను పోగొట్టుకుంది.
Nidhan
పోటీ లేదు, మనకు సాటిలేదని అనుకుంటే శ్రీలంక లాంటి ప్రభ కోల్పోయిన టీమ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ జట్టును వైట్‌వాష్ చేస్తుందని అనుకుంటే.. వరుస మ్యాచుల్లో ఓడి సిరీస్‌ను పోగొట్టుకుంది టీమిండియా. లంక టూర్ మనకు మిక్స్డ్ రిజల్ట్స్ అందించింది. తొలుత జరిగిన టీ20 సిరీస్‌లో మెన్ ఇన్ బ్లూ ఎదురులేని ఆటతీరుతో విజేతగా నిలిచింది. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో వన్డే సిరీస్‌లోనూ సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుందని అంతా ఊహించారు. పైగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లంతా దిగడంతో లంకకు దబిడిదిబిడేనని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే.. సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది భారత్.
కెప్టెన్ రోహిత్ తప్పితే మిగిలిన బ్యాటింగ్ యూనిట్ ఫెయిల్ అవడం, బౌలర్లు అంచనాలను అందుకోకపోవడం, టీమ్ కాంబినేషన్ సెట్ కాకపోవడం ఇలా టీమిండియా ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు జట్టు ఓటమి గురించి చర్చ నడుస్తున్న తరుణంలోనే సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు, ఐదు నంబర్లలో ఆడే రాహుల్‌ను తొలి రెండు వన్డేల్లో ఆరో, ఏడో పొజిషన్లో ఆడించారు. ఆఖరి మ్యాచ్‌లో అతడ్ని తీసేసి రిషత్ పంత్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. పంత్ విఫలమవడంతో రాహుల్ ఉంటే వికెట్ల పతనాన్ని ఆపి, ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేవాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ రియాక్ట్ అయ్యాడు.
చివరి వన్డేలో రాహుల్‌ను ఆడించకుండా టీమిండియా తప్పు చేసిందన్నాడు కమ్రాన్ అక్మల్. కావాలంటే శివమ్ దూబేను తీసేసి అతడ్ని ఆడించాల్సిందని, కథ వేరేలా ఉండేదన్నాడు. దీనిపై ఒక్కసారి ఆలోచించాల్సిందన్నాడు. ‘కేఎల్ రాహుల్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టడం షాకింగ్‌గా అనిపించింది. అతడు ఓపెనర్. కానీ కీపింగ్ చేయగలడనే ఉద్దేశంతో 8వ నంబర్లో ఆడించారు. అయినా ఓకే, కానీ టీమ్‌లో నుంచి తీసేయడం కరెక్ట్ కాదు. కావాలంటే దూబేను తీసేయాల్సింది. సిరాజ్‌తో పాటు ఇంకో ఎండ్‌లో అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించాల్సింది. రియాన్ పరాగ్‌తో కూడా బౌలింగ్ వేయించొచ్చు. కానీ రాహుల్‌ను తీసుకోకపోవడం కరెక్ట్ కాదు. అతడు ఉంటే టీమ్ బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉండేది’ అని అక్మల్ చెప్పుకొచ్చాడు. మరి.. రాహుల్‌ను ఆడించకుండా తప్పు చేశారనే వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.