రోహిత్‌ శర్మ స్థానంలో టీమిండియా కెప్టెన్ గా KL రాహుల్‌? పాండ్యాకు బిగ్‌ షాక్‌!

KL Rahul, IND vs SL: రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌ అవుతాడని భావిస్తున్న పాండ్యాకు షాకిస్తూ.. కేఎల్‌ రాహుల్‌ భారత జట్టును నడిపించనున్నాడు. దాని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

KL Rahul, IND vs SL: రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌ అవుతాడని భావిస్తున్న పాండ్యాకు షాకిస్తూ.. కేఎల్‌ రాహుల్‌ భారత జట్టును నడిపించనున్నాడు. దాని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి.. భారత క్రికెట్‌ అభిమానులకు అంతులేని సంతోషాన్ని అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతే బాధను కూడా ఇచ్చాడు. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. రోహిత్‌ శర్మతో పాటు, విరాట్‌ కోహ్లీ కూడా టీ20లకు గుడ్‌బై చెప్పడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ బాధపడ్డారు. ఇక ముందు ఈ ఇద్దరు లెజెండ్స్‌ను టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున చూడలేమా అంటూ తమ బాధను వ్యక్తం చేశారు. వీరితో పాటే రవీంద్ర జడేజా సైతం టీ20ల నుంచి తప్పుకున్నాడు. అయితే.. రోహిత్‌ టీ20ల నుంచి తప్పుకోవడంతో టీ20లకు కొత్త కెప్టెన్‌ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది.

ఇప్పటికే టీ20ల్లో వైస్‌ కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యకే కెప్టెన్సీ పగ్గాలు దక్కుతాయని చాలా మంది భావించారు. కానీ, బీసీసీఐ వేరేలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్‌ టీమిండియా జింబాబ్వేతో టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత టీమిండియా.. టీ20, వన్డే సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు లంక పర్యటనకు వెళ్లనుంది. అయితే.. ఈ సిరీస్‌లో టీమిండియాకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ వహించే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో యంగ్‌ టీమిండియాను రాహుల్‌ లీడ్‌ చేయనున్నట్లు సమాచారం.

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి ప్రస్తుతం దాన్ని ఆస్వాదిస్తూ రెస్ట్‌ మూడ్‌లో ఉన్న టీమిండియా స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రాలకు శ్రీలంకతో సిరీస్‌లో రెస్ట్‌ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందటా.. మరి వీరితో పాటే హార్ధిక్ పాండ్యాకు కూడా విశ్రాంతి ఇస్తారో లేదో చూడాలి. ఒక వేళ పాండ్యా టీ20 సిరీస్‌ ఆడితే.. అతనే టీ20ల్లో కెప్టెన్‌గా వ్యవహరించే ఛాన్స్‌ ఉంది. కానీ, వన్డేలకు మాత్రం రోహిత్‌ వారుసుడిగా పాండ్యాను కాకుండా కేఎల్‌ రాహుల్‌ను బీసీసీఐ ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్‌ తర్వాత వన్డే టీమ్‌కు కూడా కెప్టెన్‌ అవ్వాలని భావిస్తున్న పాండ్యాకు ఇది పెద్ద ఎదురు దెబ్బగా భావించవచ్చు. మరి వన్డే టీమ్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments