iDreamPost
android-app
ios-app

వీడియో: రోహిత్‌, కోహ్లీలకు అవమానం! KL రాహుల్‌ ఫ్యాన్స్‌ ఓవర్‌ యాక్షన్‌

  • Published May 03, 2024 | 9:27 AM Updated Updated May 03, 2024 | 9:27 AM

KL Rahul, Rohit Sharma, Virat Kohli: టీ20 వరల్డ్‌ కప్‌లో కేఎల్‌ రాహుల్‌కు చోటు దక్కలేదని.. అతని అభిమానులు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీని అవమానిస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

KL Rahul, Rohit Sharma, Virat Kohli: టీ20 వరల్డ్‌ కప్‌లో కేఎల్‌ రాహుల్‌కు చోటు దక్కలేదని.. అతని అభిమానులు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీని అవమానిస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published May 03, 2024 | 9:27 AMUpdated May 03, 2024 | 9:27 AM
వీడియో: రోహిత్‌, కోహ్లీలకు అవమానం! KL రాహుల్‌ ఫ్యాన్స్‌ ఓవర్‌ యాక్షన్‌

ఒక వైపు ఐపీఎల్‌ జోరుగా సాగుతున్నా.. మరోవైపు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఇండియన్‌ టీమ్‌ సెలెక్షన్‌పై వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కొంతమంది ఆటగాళ్లను టీ20 వరల్డ్‌ కప్‌కు ఎంపిక చేయలేదని క్రికెట్‌ అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేఎల్‌ రాహల్‌, శుబ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ లాంటి ఆటగాళ్లకు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కలేదు. వీరు ముగ్గురు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నారు. పైగా ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. అయినా కూడా భారత సెలెక్టర్లు వీరికి మొండిచేయి చూపించారు. అయితే.. వీరికి టీమిండియాలో చోటు దక్కకపోవడంపై అంతా నిరాశ వ్యక్తం చేస్తే.. కొంతమంది మాత్రం కాస్త హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు.

టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేయలేదని అతని ఫ్యాన్స్‌ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని అవమానించేలా ప్రవర్తించారు. రోహిత్‌, కోహ్లీ ఫొటోలను రోడ్డుపై ప్రదర్శిస్తూ.. ఫొటోలను కర్రలు, చెప్పులతో కొడుతూ.. కాస్త అతిగా ప్రవర్తించారు. టీమిండియాకు ఎంపిక కానంత మాత్రానా.. ఇతర క్రికెటర్లను ఇలా అవమానించాలా అంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా.. కేఎల్‌ రాహుల్‌ని టీమ్‌లోకి సెలెక్టర్లు తీసుకోకుంటే.. అందుకు రోహిత్‌, కోహ్లీ ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాలపై మన క్రికెటర్లను మనమే అవమానించుకోవడం సరికాదని హితవు పలుకుతున్నారు.

అయితే.. కేఎల్‌ రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో భారత చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చాలా క్లియర్‌గా వెల్లడించాడు. కేఎల్‌ రాహుల్‌ అద్భుతమైన ప్లేయర్‌ అందులో ఎలాంటి సందేహం లేదని, కానీ, అతను టాప్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆడుతున్నాడు. కానీ, రిషభ్‌ పంత్‌, సంజు శాంసన్‌ రూపంలో ఇద్దరు యంగ్‌ వికెట్‌ కీపర్లు అద్భుతంగా ఆడుతున్నారు. పైగా సంజు శాంసన్‌ టాపార్డర్‌లో ఆడగలడు, అలాగే పంత్‌ ఢిల్లీ తరఫున 5వ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అందుకే టీమ్‌లో రాహుల్‌కు చోటు కల్పించలేకపోయాం. అక్కడ స్పెస్‌ లేదు అని అగార్కర్‌ చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. అయినా కూడా కొంతమంది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మరి రోహిత్‌, కోహ్లీపై ఫొటోలపై దాడి చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.