Prakhar Chaturvedi: 46 ఫోర్లు, 3 సిక్సులు.. 404 నాటౌట్‌! భారత క్రికెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డ్‌

Prakhar Chaturvedi: భారత దేశవాళీ క్రికెట్‌లో మరో సంచలన యువ కెరటం దూసుకొస్తోంది. ఒకటి కాదు రెండు ఏకంగా 404 పరుగులు చేసి.. భారత క్రికెట్‌ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కానీ రికార్డును ఓ కుర్రాడు తన పేరిట లిఖించుకున్నాడు. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Prakhar Chaturvedi: భారత దేశవాళీ క్రికెట్‌లో మరో సంచలన యువ కెరటం దూసుకొస్తోంది. ఒకటి కాదు రెండు ఏకంగా 404 పరుగులు చేసి.. భారత క్రికెట్‌ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కానీ రికార్డును ఓ కుర్రాడు తన పేరిట లిఖించుకున్నాడు. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

భారత అండర్‌ 19 క్రికెట్‌ చరిత్రలో ఓ కుర్రాడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఏకంగా 404 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి.. హిస్టరీ క్రియేట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ కుర్రాడి పేరు భారత క్రికెట్‌ వర్గాల్లో మారుమోగిపోతుంది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. కర్ణాటకకు చెందిన ప్రఖర్‌ చతుర్వేది. ఈ కుర్రాడు కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో ముంబైతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడుతూ.. సంచలనం నమోదు చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన చతుర్వేది.. ఏకంగా 404 పరుగులు చేశాడు. భారత అండర్‌ 19 క్రికట్‌ చరిత్రలో 400 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చతుర్వేది నిలిచాడు.

మొత్తంగా ఈ మ్యాచ్‌లో 638 బంతులు ఎదుర్కొన్న చతుర్వేది.. 63.32 స్ట్రైక్‌రేట్‌తో 46 ఫోర్లు, 3 సిక్సులతో 404 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జట్టులోని మరో ఆటగాడు హర్షిల్‌ ధరమణి 169 పరుగులు చేయడంతో కర్ణాటక ఏకంగా 890 పరుగులు చేసింది. అంతకు ముందు ముంబై తన తొలి ఇన్నింగ్స్‌లో 380 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అయితే.. ముంబై తొలి ఇన్నింగ్స్‌ ను స్కోర్‌ను కర్ణాటక ఆటగాడు చతుర్వేది ఒక్కడే దాటేయడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత.. చతుర్వేది పేరు టాక్‌ ఆఫ్‌ ది డొమెస్టిక్‌ క్రికెట్‌ టౌన్‌గా మారిపోయింది. మరి అండర్‌ 19 క్రికెట్‌లో 404 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన చతుర్వేదిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments